భూమిపై సూర్యుడు అస్తమించని ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలుసా?
రోజులో 24 గంటలు… ఉదయం ఆయా ప్రాంతాలను బట్టి సూర్యుడు ఉదయిస్తాడు. సాయంత్రం సమయంలో అస్తమిస్తాడు. ఇది మనకు తెలిసిన విషయాలు. అయితే, ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో అసలు సూర్యుడు అస్తమించడట. అంటే 24 గంటలు వెలుగు ఉంటుంది. భానుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆ ప్రాంతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
నార్వేలోని హమ్మర్‌ఫెస్ట్ అనే నరగం ఉన్నది. ఈ నగరంలో 24 గంటల పాటు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. అయితే, రాత్రి 12:43 గంటల సమయంలో సూర్యుడు మేఘాల చాటుకు వెళ్లి 40 నిమిషాల తరువాత మళ్లి ఉదయిస్తాడట. అలానే హమ్మర్‌ఫెస్ట్‌తో పాటుగా స్వాల్‌బర్డ్ ప్రాంతంలో కూడా 24 గంటలు సూర్యుడు కనిపిస్తాడు. ఏప్రిల్ 10 నుంచి ఆగస్ట్ 23 వరకు ఇలా జరుగుతుంది.
ఇక ఐస్‌లాండ్‌లో జూన్ మాసంలో అసలు సూర్యుడు అస్తమించడు. కెనడాలోని యూకొన్ లో సంవత్సరంలో 50 రోజులపాటు సూర్యుడు అస్తమించడు. అలాగే గ్రీన్‌లాండ్‌లోని ఉత్తర ప్రాంతంలో ఉండే కానాక్ నగరంలో శీతాకాలంలో సూర్యుడే కనిపించడు. ఎండాకాలానికి వచ్చే సరికి 24 గంటలు సూర్యుడు కనిపిస్తాడు. ఇక స్వీడన్‌లోని కిరునా నగరంలో ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు సూర్యుడు అస్తమించడట.