బి.సి. రిజర్వేషన్లు – క్రీమీలేయర్
సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాంగంలో పొందుపరచబడిన
నిబంధనల ప్రకారం “రిజర్వేషన్” సౌకర్యం కల్పించబడినది. ఆ మేరకు షెడ్యూల్డు
కులాలు, షెడ్యూల్డు తెగలు ఇత్యాది వెనుకబడిన తరగతులకు చెందినవారికి రిజర్వేషన్
సౌకర్యం వర్తింపజేయబడినది. వెనుకబడిన తరగతులకు రాష్ట్రస్థాయిలో రిజర్వేషన్
సౌకర్యమును 1970వ సం॥లో జీ.ఓ.యం.యస్. నెం.1793 ద్వారా కల్పించినప్పటికీ,
కేంద్రస్థాయిలో మండల్ కమిషన్ సిఫారసుల మేరకు 1993వ సం|| నుండి రిజర్వేషన్
సౌకర్యం కల్పించబడినది..
కానీ ఇతర వెనుకబడిన తరగతులకు (OBC) రిజర్వేషన్లు అమలు చేయుటకు వారిలోని
క్రిమీలేయర్ (సంపన్న శ్రేణి)ను మినహాయించాలని సుప్రీం కోర్టు ఇందిరా సహానీ VS
యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పును వెలువరించినది. సుప్రీం కోర్టు తీరు మేరకు
ఇతర వెనుకబడిన తరగతులలో క్రిమీలేయర్ (సంపన్న శ్రేణి)ను గుర్తించుటకు కేంద్ర
ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని వేయడం జరిగినది. ఆ కమిటీ చేసిన సూచనల మేరకు
వెనుకబడిన తరగతులలో క్రిమీలేయర్ (సంపన్న శ్రేణి)ను గుర్తించడం
జరుగుతుంది.
సంపన్నశ్రేణి క్రీమీ లేయర్ అనగానేమి?
వెనుకబడిన తరగతులకు చెందిన వారిలో సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన
వారిని ‘సంపన్నశ్రేణి’ (క్రీమీ లేయర్) గా పరిగణిస్తారు.
సంపన్నశ్రేణి క్రీమీ లేయర్ కి చెందిన వారికి రిజర్వేషన్ సౌకర్యం
వర్తిస్తుందా?
సంపన్నశ్రేణికి చెందినవారు వెనుకబడిన తరగతులకు చెందినప్పటికీ, వారు
సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినవారైనందున రిజర్వేషన్ సౌకర్యమును
పొందుటకు అనర్హులు. వారు ఓపెన్ కేటగిరీలో మాత్రమే పోటీపడవలసి ఉంటుంది.
సంపన్నశ్రేణిని క్రీమీ లేయర్ గుర్తించడమెలా?
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ చేయబడిన సూచనల ప్రకారం వెనుకబడిన
తరగతులలోని సంపనశ్రేడిని ఈ క్రింద తెలియ జేయబడిన విధంగా
గుర్తిస్తారు.
I రాజ్యాంగంలో పొందుపరచబడిన పోస్తులలో ఉన్న వారి పిల్లలు:
రాజ్యాంగంలో పొందుపరచబడి క్రింద తెలియజేయబడిన పోస్టులలో ఉన్న వారి పిల్లలు
క్రిమీలేయర్ (సంపన్న శ్రేణి)గా పరిగణించబడతారు.
-
రాష్ట్రపతి
-
ఉపరాష్ట్రపతి
-
సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు పరిపాలన ట్రిబ్యునల్ న్యాయమూర్తులు
-
UPSC & PSC అధ్యక్షులు మరియు సభ్యులు చీఫ్ ఎలక్షన్ కమీషనర్
(CEC) -
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG)
-
అటార్నీ జనరల్ మరియు అడ్వకేట్ జనరల్
-
అధికార భాషా సంఘ సభ్యులు
-
కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు,
-
MP, MLA & MLCలు,
-
ఎగువ చట్టసభల ఛైర్మన్ మరియు డిప్యూటీ ఛైర్మన్లు.
-
రాజ్యాంగంలో పొందుపరచబడిన ఇతర పోస్టులలో ఉన్నవారు
II. సినిల్ ఉద్యోగులు
క్రింద తెలియజేయబడిన తేటగిరీలకు చెందిన సివిల్ ఉద్యోగుల పిల్లలు శ్రీమీలేయర్
(సంపన్న శ్రేణి) గా పరిగణించబడతారు.
1. తల్లి దండ్రులిరువురూ లేక ఏ ఒక్కరైనా ఆల్ ఇండియా సర్వీసులలో (IAS, IPS
& IFS) డైరక్టుగా నియామకం పొందినవారు.
2. తల్లిదండ్రులిరువురూ లేక ఏ ఒక్కరైనా గ్రూప్ 1 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా
నియామకం పొందినవారు.
3. తల్లిదండ్రులిరువురూ గ్రూప్-2 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం
పొందినవారు.
4. తల్లిదండ్రులలో ఏ ఒక్కరైనా గ్రూప్-2 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం
కాలడి, 40 సం॥ల లోపు గ్రూప్-1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందినవారు. 40 సం॥ల
తర్వాత గ్రూప్-1 స్థాయికి ప్రమోషన్పొందినవారు క్రీమీలేయర్కు చెందరు.
పైన తెలియజేయబడిన కేటగిరీలకు చెందిన ఉద్యోగస్థులు సర్వీసులో ఉన్నా, రిటైరైనా
లేక మరణించినా వారి పిల్లలు క్రీమీలేయర్ (సంపనశ్రేణి) గా పరిగణించబడతారు. అలా
గాక, తల్లిదండ్రులిరువురూ లేక ఏ ఒక్కరైనా. గ్రూప్-3 లేక గ్రూప్ 4 స్థాయిలో
తొలుత నియామకం పొందియుండిన ఎడల వారి పిల్లలు ఎట్టి పరిస్థితులలోనూ సంహనశ్రేణిగా
పరిగణించబడరు. ఒక వేళ గ్రూప్ 3 లేక గ్రూప్ 4 స్థాయిలో తొలుత నియమింపబడి,
40ఏళ్లలోపే గ్రూప్-1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందినప్పటికీ వారి పిల్లలు
‘సంపన్నశ్రేణి’ క్రిందకు రారు.
సివిల్ ఉద్యోగుల విషయంలో ముఖ్యంగా గమనించవలసిన అంశమేమిటంటే వారు తొలుత నియామకం
పొందిన స్థాయిని బట్టి వారి పిల్లలు సంవస్తశ్రేణి క్రిందకు వస్తారా? రాదా? అన్న
విషయం నిర్ణయించబడుతుంది. అంతేకానీ, వారు పొందు జీతభత్యములును బట్టి మాత్రం
కాదు. ఈ విషయమును మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి క్రింది ఉదాహరణలను
పరిశీలించండి.
1) గ్రూప్ – 1 స్థాయి ఉద్యోగమైన జిల్లా బిసి సంక్షేమాధికారి (DSCWO)
పోస్టులో డైరక్టుగా నియామకం. పొందిన వ్యక్తి మూల వేతనం రూ॥ 10,285/-, DA, HRA,
IR మొ। వాటిని కలుపుకొన్న యెడల, జిల్లా బి.సి. సంక్షేమాధికారి (DBCWO) యొక్క
జీతం నెలకు సుమారు రూ. 21,000/-, ఆ ప్రకారం వార్షిక జీతం సుమారు రూ.2.50,000/
జిల్లా బి.సి. సంక్షేమాధికారి (DBCWC) గా తొలి నియమానం పొందిన వ్యక్తి
జీతధత్యముల ద్వారా పొందు వార్షికాదాయం ప్రస్తుతం క్రీమీలేయరుగా పరిగణింపబడుటకు
ఉన్న ఆదాయపరిమితి రూ.4.50లక్షలు (కేంద్ర ప్రభుత్వం OBC) / 4,00లక్షలు (రాష్ట్ర
ప్రభుత్వం – BC) కన్నా తక్కువే అయినప్పటికీ, తను గ్రూప్-1 స్థాయి ఉద్యోగంలో
డైరక్టుగా నియమాకం పొందిన వ్యక్తి కనుక అతని జీత భత్యములతో సంబంధంలేక అతని తొలి
ఉద్యోగ నియామకపు స్టేటస్ ను బట్టి అతని పిల్లలు సంపనశ్రేణిగా పరిగణించబడతారు. ఈ
ఉ దాహరణనే ఇతర గ్రూప్-1 స్థాయి ఉద్యోగారైన RDO, DSP.CTO,DPO, DSWO ATO,District
Registrar మొదలగు వాటికి కూడా వర్తింపచేయవచ్చు.
2) అదే విధంగా ఒక Hostel Welfare Officer (HWO) స్థాయిలో తొలుత ఉద్యోగంలో
నియమింపబడి, తదుపరి ప్రమోషన్ ద్వారా DBCWC స్థాయికి చేరుకున్న వ్యక్తి నెలకు
రూ. 40,000/- జీతం పొందుతూ ఉండవచ్చు. TWO అగ్రూప్ 3 స్థాయి ఉద్యోగం, DBCWO
అన్నది గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, ఆ వ్యక్తి ప్రస్తుత జీతం నెలకు రూ.
40,000చ్కొన, ఒక సంవత్సరపు జీతం రూ. 4,80,000/- అవుతుంది. అనగా అతని సంవత్సర
క్రీమీలేయర్గా పరిగణించబడడానికి ఉండవలసిన ఆదాయపరిమితి కన్నా ఎక్కువగా
ఉన్నప్పటికీ అతని తొలి నియామకం గ్రూప్-3 స్థాయి ఉద్యోగంలో జరిగినందువలన అతని
పిల్లలు క్రిమిలేయర్గా పరిగణించబడదు. ఇచ్చట గుర్తించుకోవలసిన మరో ముఖ్యమైన
అంశమేమంటే, ఉద్యోగులు అనగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగులు మరియు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు మాత్రమే. ప్రైవేటు సంస్థలలో
పనిచేయు ఉద్యోగులు ఈ కేటగిరీ క్రిందకు రారు.
III మిలిటరీ మరియు సారామిలిటరీ దళాల
మిలిటరీ (Army, Navy & Air Force) మరియు పారా మిలిటరీ దళాలలో పనిచేయుచున్న
తల్లిదండ్రులలో ఏ ఒక్కరు గానీ లేదా ఇద్దరూ కల్నల్ స్థాయి ఉద్యోగంలో యున్ని యడల
వారి పిల్లలు సంహరిశ్రకగా గుర్తించబడతారు.
ఆ తక్కువ స్థాయిలో ఉన్నవారికి సంపన్నశ్రేణి వర్తించదు.
IV. ప్రొఫెషనల్స్, వాణిజ్య మరియు వ్యాపార వర్గాలు:
ప్రైవేటుగా ప్రాక్టీసు వేస్తున్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్
అకౌంటెంట్లు, ఇన్ కంటాక్స్ కరంట్లు, ఆర్కిటెక్టులు, కంప్యూటర్ ప్రొఫెషనల్స్,
సినీ ఆర్టిస్టులు, రచయితలు, కర్తరిస్టులు, క్రీడాకారులు మొదలగువారు. వారి
ఆదాయాన్ని బట్టి సంపనశ్రేణిగా గుర్తించబడతారు. అనగా, మూడు సంవత్సరాల పాటు
వరుసగా వారి వార్షికాదాయం నిర్ధేశించబడిన ఆదాయ పరిమితిని దాటితే అట్టి వారి
పిల్లలు సంపన్న శ్రేణి గా గుర్తించబడతారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించిన వార్షికాదాయ పరిమితి రూ॥ 4.50 లక్షలు
కాగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన వార్షికాదాయ పరిమితి రూ॥ 4.00 లక్షలు కేంద్ర
ప్రభుత్వముతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పరిమితిని పెంచటానికి ప్రభుత్వ
స్థాయిలో పరిశీలన జరుగుచున్నది.
V. ఆస్తి దారులు
ఎ. వ్యవసాయ భూమి
సౌకర్యం కలిగి, Land Celing Ad ప్రకారం ఉండగలిగిన భూమిలో 85% భూమి ఉదయెడల,
వారి పిల్లలను సంపనశ్రేణిగా పరిగణిస్తారు. ii). ఉన్న భూమిలో కొంత సాగునీటి
సౌకర్యం కలది, కొంత సాగునీటి సౌకర్యం లేనిది అయిన యెడల, సాగునీటి సౌకర్యం గల
భూమి Land Celing Act ప్రకారం ఉండగలిగిన భూమిలో కనీసం 40% కంటే ఎక్కువగా
ఉన్నప్పుడే, మిగతా మెట్ట భూమిని కన్వర్షన్ ఫార్ములా ప్రకారం సాగునీటి భూమిగా
మార్చి రెంటినీ కలిపి చూసి, Land Calling Act ప్రకారం ఉండగలిగిన భూమిలో 80%
కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అట్టి వారి పిల్లలను సంపన్నశ్రేణిగా
పరిగణిస్తారు.
i). ఒక వేళ ఉన్న భూమి అంతా మెట్టభూమియే అయినప్పుడు, ఎంత భూమి ఉన్నప్పటికీ వారి
పిల్లలు సంపన్నశ్రేకిగా పరిగణించబడరు. ఇచ్చట గుర్తించవలసిన ముఖ్యమైన అంశమేమనగా,
భూమి పరిమాణమును బట్టి మాత్రమే సంపనశ్రేణి నిర్ణయిస్తారు. ఆ భూమి ఆ భూమి ద్వారా
వచ్చు ఆదాయంతో ఏ మాత్రం సంబంధంలేదు. ఉండవలసిన భూపరిమాణం కంటే తక్కువగా భూమిని
కలిగి ఆ భూమి ద్వారా వచ్చు ఆదాయం సంపనశ్రేణి ఆదాయ పరిమితి కన్నా ఎక్కువ
ఉన్నప్పటికీ, అట్టి వారి పిల్లలను సంపన్న శ్రేణి గా పరిగణించరాదు.
బి) మామిడి, చిత్తాయి, నిమ్మ మొ|| తోటలు:
ఉన్న భూమి సాధారణ వ్యవసాయ భూమి గాక పైన తెలియజేయబడిన తోటరైనచో, నీటిని మామూలు
సాగునీటి పారుదల గల వ్యవసాయ భూమిగా గుర్తించడం జరుగుతుంది. అంట్, Land Ceiling
Act ప్రకారం 85% కంటే ఎక్కువగా భూమిని కలిగి, భూమిలో పైన తెలిపిన తోటలు
ఉన్నయెడల, అట్టివారి పిల్లలను సంపన్న శ్రేణి గా పరిగణించబడటం జరుగుతుంది.
i) కాఫీ, టీ, రబ్బరు మొ|| తోటలు:
ఉన్న భూమి సాధారణ వ్యవసాయ భూమి గాక పైన తెలియజేయబడిన తేటలైనచో, వాటిపై వచ్చు
ఆదాయమును బట్టి క్రిమిలేయర్ నిర్ణయం జరుగుతుంది. అనగా, పైన తెలియజేయబడిన
విధముగా నిర్ధేశించబడిన ఆదాయ పరిమితి కన్నా మించిన ఆదాయమును మూడు సం॥లు వరుసగా
పొందిన యెడల, అట్టివారి పిల్లలు. క్రీమీలేయర్గా పరిగణించబడతారు.
సి) పట్టణాలలో ఖాళీ స్థలం / భవనములు:
Wealth Tax వర్తింపజేయబడి, పరిమితికి మించిన ఆస్తిని కలిగిన వారి పిల్లలు సంపన్న శ్రేణి గా పరిగణించబడతారు.
క్రీమీలేయర్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు:
పైన తెలియజేయబడిన వివిధ అంశాల ద్వారా క్రీమీలేయర్ క్రిందకు ఎవరెవరు
వస్తారన్నది నిర్ణయించడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన పేర్కొని అంశాలలో విద్య ఆదాయ పరిమితి
విషయాన్ని మినహాయించి, మిగతా అన్నింటినీ రాష్ట్ర స్థాయిలో వెనుకబడిన తరగతులలో
క్రీమీలేయర్ గుర్తింపునకు ఆచరించాలని జీ.ఓ.యం.యస్. నెం.3, తేది. 4-4-2006
ద్వారా తగు ఉత్తర్వులను ఇవ్వడం జరిగినది.
క్రిమీలేయర్ అంశాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరి కొన్ని
వివరణలు:
1) శ్రీమీలేయర్ అంశం ప్రస్తుతం ఉద్యోగాలకు, విద్యా సంస్థల్లో ప్రవేశానికి
మాత్రమే వర్తింపచేయాలి.
2) ఉద్యోగుల విషయంలో క్రీమీలేయర్ ను వారు తొలుత నియామకం పొందిన ఉద్యోగ
స్థాయిని బట్టి మాత్రమే నిర్ణయిస్తారు. వారు పొందు ! జీతభత్యాలతో ఏ మాత్రం
సంబంధం లేదు.
3) ఒక్కొక్కసారి కొందరు ఉద్యోగులకు కొంత వ్యవసాయ భూమి కూడా వుండవచ్చు అట్టి
పరిస్థితులలో వారు క్రీమీలేయరు క్రిందకు వస్తారా ? రారా ? అన్ని విషయాన్ని
వేరువేరుగా పరిశీలించాలి. ఒకవేళ, వారి తొలి ఉద్యోగ నియామకపు స్టేటస్ ను బట్టి
క్రీమీలేయరు క్రిందకు రాని వారు వారికున్న వ్యవసాయ భూపరిమితిని బట్టి
శ్రీమీలేయరు క్రిందకు రావచ్చు. వ్యవసాయ భూమి విషయంలో పైన తెలియజేసిన విధంగా ఎంత
పరిమాణం ఉన్నది అర్షదే ముఖ్యంగానీ, ఆ భూమి ద్వారా ఎంత ఆదాయం వస్తున్నదని కాదు.
జీత భత్యాలను, వ్యవసాయం ద్వారా వచ్చు ఆదాయాన్ని కలిపి క్రీమీలేయరున్ను
నిర్ణయించరాదు.
4) జీత భత్యాలు, వ్యవసాయం ద్వారా వచ్చు ఆదాయము కారు ఇతర సేవలు లేర వ్యాపారం
లేక వాణిజ్యం లాంటి ఇతర రంగాల ద్వారా ఆదాయాన్ని పొందుచున్న యెడల. ఇతర రంగాల
ద్వారా పొందు ఆదాయం క్రీమీలేయర్ పరిగణనకు ఆదాయాన్ని ముంచిన యెడల, అప్పుడే వారి
పిల్లలు క్రిమీలేయర్గా పరిగణించబడతారు.
5) వివిధ సేవా వృత్తుల ద్వారా మరియు వ్యాపార, వాణిజ్య రంగాల ద్వారా ఆదాయం
పొందుచున్న వారికి మాత్రమే ఆదాయ పరిమితి పరీక్ష వర్తింపజేసి, క్రీమీలేయర్
క్రిందకు వస్తారా ? రారా ? నిర్ణయించాలి.
6) ఎవరైనా కొందరు ఉద్యోగులు కొంత వ్యవసాయ భూమితో పాటు ఇతర రంగాలనుంచి కూడా
ఆదాయాన్ని పొందుచున్నప్పుడు వారికి ఇతర రంగాల ద్వారా వచ్చు ఆదాయాన్ని బట్టి
మాత్రమే వారి క్రిమిలేయర్, స్టేటస్ ను నిర్ణయించాలి. అంతే కానీ, వేర్వేరు రంగాల
ద్వారా వచ్చు ఆదాయాన్ని కలిపి చూసి క్రిమీలేయర్ స్టేటస్ను
నిర్ణయించరాదు.
7) కొందరు Land Celing Act ప్రకారం వుండవలసిన భూమిలో 85% కన్నా తక్కువ భూమి
వున్నందువలన, ఇతర రంగాల ద్వారా వచ్చు ఆదాయం ఆదాయ పరిమితి కన్నా తక్కువగా
వున్నందువలన శ్రీమీలేయరు క్రిందకు రాక పోయినప్పటికీ, వారికి పట్టణాలలో వున్న
సంపదను బట్టి వారు క్రీమీ లేయరు క్రిందకు వచ్చు అవకాశం కలదు. ఇది ఉద్యోగులకు
కూడా వర్తిస్తుంది.
8) ఒక వ్యక్తి క్రీమీలేయర్ స్టేటస్ తన తల్లిదండ్రుల స్టేటస్ ను బట్టి మాత్రమే
నిర్ణయించాలి. తన స్టేటస్ తో సంబంధం లేదు. అనగా ఎవరైనా గ్రూప్-1 స్థాయి
ఉద్యోగమునకు ఎంపిక కాబడి. మళ్ళి గ్రూప్-1 స్థాయిలోనే ఉన్న మరో ఉద్యోగము కొరకు
గ్రూప్-1 పరీక్షలకు గానీ, సివిల్ సర్వీసు పరీక్షలకు గానీ ప్రయత్నం చేసినప్పుడు,
అతని స్టేటస్ ను బట్టి అతన్ని క్రీమీలేయర్గా పరిగణించరాదు. అలాగే స్త్రీల
విషయంలో ఆమె తల్లిదండ్రుల స్టేటస్ ను బట్టి క్రిమీలేయర్ స్టేటసన్ను
నిర్ణయించాలే గానీ, ఆమె భర్త స్టేటస్ ను బట్టి కాదు.
పై వివరణలను బట్టి శ్రీమీలేయరు ఎవరెవరికి వర్తిస్తుందో స్పష్టంగా అర్థం
చేసుకోవచ్చు. ఇది అందరు ఉద్యోగులకు వారి జీతభత్యాలను బట్టి వర్తిస్తుంది అని
అనుకోవడం సరికాదు. 60 ఒక ఉద్యోగి తొలి నియమారపు స్టేటస్ (6) ఉన్న భూమి యొక్క
పరిమాణం (ii) ప్రైవేట్ సేవలు లేక వ్యాపారం లేక వాణిజ్య రంగాల ద్వారా వచ్చు
ఆదాయం మరియు పట్టణాలలో ఉన్న ఆస్తి ద్వారా వచ్చు ఆదాయం (iv) సంపద పన్ను చట్టం
ప్రకారం పన్ను చెల్లించడం (రూ.30.00 లక్షల ఆస్థి వరకు సంపద పన్ను మినహాయింపు
కలదు) లాంటి వాటిని విడివిడిగా పరిగణనలోకి తీసుకొని, ఏ కేటగిరి క్రింద
క్రీమీలేయర్ గా పరిగణించబడతాలో స్పష్టంగా నిర్ణయించాలి. ఏ కేటగిరి క్రిందనూ
క్రీమీలేయర్గా పరిగణించబడడానికి వీలులేనప్పుడు అట్టి వారి పిల్లలు క్రీమీలేయర్
క్రిందకు రారు. వేరువేరు కేటగిరీల క్రింద పొందు ఆదాయాన్ని కలిపి చూడరాదు. అలా
కలిపి చూసి, క్రీమీలేయర్ స్టేటస్ను నిర్ణయించరాదు.
Raising the annual income limit from Rs.4.50 lakh to Rs.6.00 lakh
శ్రీ ఎ. కోటేశ్వర రావు,
IAS,
కమీషనర్ వెనుకబడిన తరగతుల
సంక్షేమశాఖ,
ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్.