PRC : ఉద్యోగుల సమస్యపై జగన్ సర్కార్ ఫోకస్: నోడల్ అధికారి నియామకం

 పీఆర్సీ, ఉద్యోగుల సమస్యపై జగన్ సర్కార్ ఫోకస్: నోడల్ అధికారి నియామకం

పీఆర్సీతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యపై ఫోకస్ పెట్టింది జగన్ సర్కార్.  ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి ఆదినారాయణను నోడల్ అధికారిగా ఏపీ సర్కార్ నియమించింది. ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి నోడల్ అధికారిని నియమిస్తున్నట్టుగా ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి: ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యపై ఫోకస్ పెట్టింది. పీఆర్సీ విషయమై ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు.దీంతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మరోవైపు ఉద్యోగుల సమస్యలపై సంప్రదింపులకు ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి ఆదినారాయణను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.2018 జూలై 03వ తేదీన పీఆర్సీ కోసం ఆశుతోష్ మిశ్రా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆశుతోష్ మిశ్రా ప్రభుత్వానికి ఈ నివేదికను అందించారు.2020 అక్టోబర్ 5న అశుతోష్ మిశ్రా పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి అందించారు.  అయితే ఈ నివేదికను ప్రభుత్వం ఇంకా ఉద్యోగ సంఘాలకు అందించలేదు. ఈ ఏడాది అక్టోబర్ 29న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. 

 పీఆర్సీ నివేదిక ఇప్పుడె  ఇచ్చేది లేదు

నవంబరు 11 –  పిఆర్సి నివేదికను తక్షణం బయట పెట్టేది లేదని, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు విభాగం కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పేర్కొన్నారు.  సచివాలయంలో బుధవారం ఆందోళన నిర్వహించిన ఏపీ ఎన్జీవో నాయకులు. అమరావతి జేఏసీ నాయకులను ఆయన గురువారం పిలిచి మాట్లాడారు.  పీఆర్సీ నివేదిక విషయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తమకు చెప్పినట్లు ఉద్యోగ సంఘ నేతలు మీడియాకు వెల్లడించారు.  శశి భూషణ్ కుమార్ తో సమావేశం అనంతరం  ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు, అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.  పిఆర్సి నివేదికను ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం  లేదో తమకు తెలియడం లేదన్నారు. అసలు పిఆర్సి అమలు చేసే ఉద్దేశం  ప్రభుత్వానికి ఉందా లేదా  అని వారు ప్రశ్నించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సభ్య సంఘాల వివరాలు ఇవ్వాలని కూడా కోరినట్లు  బొప్పరాజు,  బండి శ్రీనివాసరావు తెలిపారు. పీఆర్సీ నివేదిక విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని  శశి భూషణ్ కుమార్ వెల్లడించినట్లు  వారు చెప్పారు.  గవర్నమెంట్   ఉద్యోగుల ఫెడరేషన్ నేత వెంకట్ రామ్ రెడ్డి ని కూడా  తమతో కలవాలని కోరినట్లు చెప్పారు.

Flash...   నువ్వులు: 201 వ్యాధులకు దివ్యౌషధం ఇవి ..

బొప్పరాజు  ఏం మాట్లాడారో  ఆ వివరాలు…

పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందో అర్ధం కావడం లేదు.

– మా డిమాండ్లకు చోటుకల్పించారో లేదో  తెలియాలి.

– పీఆర్సీ అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందో లేదో స్పష్టం చేయాలి.

– రేపటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మాకు పి ఆర్ సి  అమలు  డిమాండే ముఖ్యాంశం.