Shortcuts : వాట్సాప్‌ వెబ్ లో షార్ట్‌కట్స్‌ గురించి తెలుసా

 Shortcuts : వాట్సాప్‌ వెబ్ లో షార్ట్‌కట్స్‌ గురించి తెలుసా..? అవేంటంటే..?


whatsapp web shortcuts | వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చాక ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ వయోభేదం లేకుండా అన్నివర్గాల వారికీ వాట్సాప్ ఎన్నో సేవలు అందిస్తున్నది. అయితే వాట్సాప్ సేవలు కేవలం స్మార్ట్ ఫోన్ లోనే కాకుండా డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లలో కూడా “వెబ్‌ వాట్సాప్‌” ద్వారా వినియోగించుకోవచ్చనే విషయం అందరికీ తెలిసిందే. ‘వెబ్‌ వాట్సాప్‌’ను ఉపయోగించేటప్పుడు షార్ట్‌కట్స్‌ కూడా వాడొచ్చు. ఇప్పుడు వాటిని గురించి తెలుసుకుందాం..!

సెట్టింగ్స్‌ :

వాట్సాప్‌ సెట్టింగ్‌లోకి వెళ్లాలంటే ఏవేవో నొక్కాల్సిన అవసరం లేదు. ముందుగా మెనూలోకి వెళ్లి సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అలాకాకుండా డైరెక్ట్‌గా సెట్టింగ్స్ కు వెళ్లాలంటే ctrl+alt+క్లిక్‌ చేయాలి.

మ్యూట్‌ :

ఒక గ్రూప్‌ నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ను మ్యూట్‌ చేయాలంటే ctrl+alt+shift+M ప్రెస్‌ చేయాలి.

ప్రొఫైల్‌ అండ్‌ ఎబౌట్‌ :

యూజర్‌ ప్రొఫైల్‌ అండ్‌ ఎబౌట్‌ సెక్షన్‌కు వెళ్లేందుకు ctrl+alt+P క్లిక్‌ చేస్తే సరి. వచ్చేస్తుంది.

ఆర్కివ్‌ చాట్‌:

మామూలుగా డెస్క్‌టాప్‌లో ఏదైనా గ్రూప్‌ను గానీ, వ్యక్తిగత చాటింగ్‌ను ఆర్కివ్‌ చేయాలంటే సులభం చేసుకోవచ్చు. అందుకు ctrl+alt+e క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

whatsapp web shortcuts

మార్క్‌ యాజ్‌ అన్‌రీడ్‌:

వాట్సాప్‌ గ్రూపుల్లో ఏదైనా మెసేజ్‌ వచ్చినప్పుడు ఓపెన్‌ చేసి చూస్తుంటాము. అప్పుడు పంపిన వ్యక్తికి మనం ఆ మెసేజ్‌ను చూసినట్లు తెలిసిపోతుంది. అలాకాకుండా మెసేజ్‌ను చూడకుండా ఉండేలా కూడా చేయవచ్చు. ctrl+alt+shift+u క్లిక్‌ చేస్తే అన్‌రీడ్‌ మోడ్‌లోకి మారిపోతుంది.

సెర్చ్‌ చాట్‌:

వాట్సాప్‌ గ్రూపుల్లోని చాటింగ్‌ సెక్షన్‌లో సెర్చ్‌ చేసుకోవడం సులభంగా చేసుకోవచ్చు. చాటింగ్ సెక్షన్‌ కోసం ctrl+alt+shift+f క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

పిన్‌ చాట్‌:

సాధారణంగా ముఖ్యమైన వాట్సాప్‌ గ్రూపులు ఉంటే మనకు ఎప్పుడు ముందు కనిపించేలా పిన్‌ చాట్‌ చేస్తుంటాము. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని కోసం షార్ట్‌కట్‌లో ctrl+alt+shift+p క్లిక్‌ చేయాలి.

న్యూ గ్రూప్‌, న్యూ చాట్‌:

Flash...   Diploma In Elementary Education(D.El.Ed), IASEs, CTE - Plantation/ Seedlings in DIET

అయితే కొత్తగా గ్రూప్‌ క్రియేట్‌ చేసుకునేందుకు ctrl+alt+shift+N క్లిక్‌ చేయాలి. ఇక న్యూ చాట్‌ కోసం ctrl+alt+N ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

ఎగ్జిట్‌ గ్రూప్‌:

ఏదైనా గ్రూపు నుంచి బయటకు వెళ్లిపోవాలంటే సాధారణంగా గ్రూప్‌లోని మూడు చుక్కలపై క్లిక్‌ చేసి ఎగ్జిట్‌ గ్రూప్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ctrl+alt+Backspace ప్రెస్ చేస్తే సరి. అంతేకాదు పర్సనల్ చాట్‌లో మెసేజ్‌లను క్లియర్‌ చేసుకోవడానికి కూడా దీనిని వాడుకోవచ్చు.

ఇన్‌క్రీజ్‌ లేదా డిక్రీజ్‌ స్పీడ్‌ ఆప్‌ సెలెక్టెడ్‌ వాయిస్‌ మెసేజ్‌ :

ఎంచుకున్న వాయిస్ మెసేజ్‌ స్పీడ్‌ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి కూడా ఓ ఆప్షన్‌ ఉంది. అదే shift+.