SUKANYA SAMVRUDDI YONANA: SSY: ఈ స్కీమ్ లో చేరితే మీ అమ్మాయి పెళ్లి నాటికి రూ.65 లక్షలు..!

 ఈ స్కీమ్ లో చేరితే మీ అమ్మాయి పెళ్లి నాటికి రూ.65 లక్షలు..!


కేంద్రం మన కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు రావడం జరిగింది. ఈ స్కీమ్స్
వలన చాలా ప్రయోజనాలను మనం పొందొచ్చు. అయితే ఈ స్కీమ్స్ లో ఆడ పిల్లలకి కూడా
కొన్ని ప్రత్యేక స్కీమ్స్ వున్నాయి. వీటిల్లో సుకన్య సమృద్ధి యోజన పధకం కూడా
వుంది. ఇక దీని గురించి పూర్తి వివరాల లోకి వెళితే.

ఈ పథకం ద్వారా అమ్మాయిల భవిష్యత్‌ కి ఆర్థిక భద్రత కల్పించొచ్చు. అలానే
చదువు, పెళ్లి వంటి వాటికి ఏ సమస్యా ఉండదు. ఈ స్కీమ్ లో ప్రతి నెలా కొంత
మొత్తాన్ని డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.

ఇలా ప్రతీ నెలా కూడా డిపాజిట్ చేస్తూ 15 ఏళ్లు డిపాజిట్ చెయ్యాలి. ఈ స్కీమ్
మెచ్యూరిటీ కాలం వచ్చేసి 21 ఏళ్లు. మెచ్యూరిటీ కాలం పూర్తి అయ్యాక చేతికి
డబ్బులు వస్తాయి. మీ పిల్లకి పద్దెనిమి ఏళ్ళు వచ్చాకనే కొంత మొత్తాన్ని
విత్‌డ్రా చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ స్కీమ్‌ పై 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. బ్యాంకులు లేదా
పోస్టాఫీస్‌కు వెళ్లి కూతురి పేరుపై సుకన్య అకౌంట్ తెరవొచ్చు. మీ ఇంట్లో
ఇద్దరు ఆడపిల్లలు వున్నా కూడా చేరచ్చు. ఒక ఆర్థిక సంవత్సరం లో ఈ స్కీమ్ లో
చేరిన వారు రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక ఎంత డబ్బులు వస్తాయి
అనేది చూస్తే.. రోజుకు రూ.416 ఆదా చేస్తే.. మెచ్యూరిటీ సమయం లో రూ.65 లక్షలు
పొందే ఛాన్స్ ఉంటుంది.

Scheme పూర్తి వివరాలకు

Flash...   మీరు PF నుండి ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు