WhatsApp Stickers: వాట్సాప్ స్టిక్కర్స్.. సేవ్‌ చేయకుండానే పంపేయండిలా!

WhatsApp Stickers: వాట్సాప్ స్టిక్కర్స్.. సేవ్‌ చేయకుండానే పంపేయండిలా! 

ఇంటర్నెట్‌డెస్క్‌: వంద మాటల్లో చెప్పలేనిది ఒక్క ఫొటోలో చెప్పొచ్చు అనేది పాత నానుడి. ప్రస్తుత టెక్‌ జమానాలో వంద మాటల్లో చెప్పేదాన్ని ఒక ఎమోజీ లేదా స్టిక్కర్‌తో చెప్పేయొచ్చనేది నేటి తరం నానుడి. అందుకే మెసేజింగ్ యాప్‌లు ఎప్పటికప్పుడు కొత్త స్టిక్కర్స్‌, ఎమోజీలను తీసుకొస్తూ యూజర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా వాట్సాప్‌ స్టిక్కర్స్‌కు సంబంధించి కొత్త ఫీచర్‌ను యూజర్స్‌కి పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో యూజర్స్‌ స్టిక్కర్స్‌ను సేవ్ చేసుకోకుండానే ఇతరులకు పంపొచ్చు. గతంలో ఇతరుల నుంచి మనకు వచ్చిన స్టిక్కర్స్‌ను ఫేవరెట్స్‌లో సేవ్ చేసుకోవాల్సిందే. తర్వాత వాటిని ఇతరులకు పంపేవాళ్ళం

తాజా అప్‌డేట్‌లో ఇతరులు పంపిన స్టిక్కర్స్‌ను ఫేవరెట్స్‌లో సేవ్ చేసుకోవాల్సిన అవసరంలేదు. డైరెక్టుగా స్టిక్కర్‌పై క్లిక్ చేసి ఛాట్ పేజ్‌లోని ఇతర యూజర్స్‌కు ఫార్వార్డ్ చేయొచ్చు. అలానే ఏదైనా స్టిక్కర్‌ను మనకు నచ్చినట్లుగా ఎడిట్‌ చేసి ఇతరులకు పంపొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ వెబ్‌ యూజర్స్‌కు అందుబాటులో ఉంది. ఇందుకోసం వాట్సాప్ ఛాట్‌ పేజీలో అటాచ్ ఫైల్‌పై క్లిక్ చేస్తే స్టికర్స్‌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఏదైనా ఇమేజ్‌ను ఎంచుకోవాలి. తర్వాత మీకు ఛాట్ పేజ్‌లో ఎడిట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీరు టెక్ట్స్‌, ఎమోజీలను సదరు ఫొటోకు జోడించడంతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌లో మార్పులు చేయొచ్చు. అయితే మీరు డిజైన్‌ చేసే స్టిక్కర్స్‌ను గిఫ్‌లా చేయలేరు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తిస్థాయిలో యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొస్తారని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. 

Flash...   D.El.ED Exam 2021 schedule