కచ్చితంగా రాష్ట్రంలో 3 రాజధానులు: కన్నబాబు

 కచ్చితంగా రాష్ట్రంలో మూడు రాజధానులు: మంత్రి కన్నబాబు

అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానుల అంశంపై మంత్రి కన్నబాబు స్పష్టతనిచ్చారు. రాష్ట్రానికి మూడు రాజధానులు తేవడం మా తరమో కాదో మీరే చూస్తారని ప్రతిపక్షాలను ఉద్దేశించి మంత్రి  అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. 

కచ్చితంగా రాష్ట్రంలో మూడు రాజధానులు వస్తాయని మంత్రి తెలిపారు. గులాబ్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం కింద 22 కోట్లు అందించామన్నారు. పంట నష్టం కింద 13.96 లక్షల మందికి 1071 కోట్లు ఇచ్చామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టంపై అంచనాలు వేస్తున్నామన్నారు. కేంద్రం మేలు చేస్తుంటే పక్క రాష్ట్రాల్లో రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రైతుల విషయాల్ని రాజకీయాలు చేయొద్దని మంత్రి కన్నబాబు హితవు పలికారు

Flash...   మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న జగన్‌ సర్కార్‌