బిగ్ రిలీఫ్.. కరోనా కొత్త వేరియంట్‌ OMICRON పై కొవిడ్ టీకాలు పని చేస్తున్నాయ్..!

 Omicron : కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మొదలయ్యాయి. తగ్గిందనుకున్నప్పుడల్లా…. కొత్త వేరియంట్లతో విరుచుకుపడడం కరోనా నైజంలా ఉంది. ఒమిక్రాన్ రూపంలో గతంలో కన్నా మరింత బీభత్సం సృష్టించేందుకు వైరస్ కాచుక్కూచుంది. దక్షిణాఫ్రికాలో మొదలై బొట్స్ వానా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయిల్, బ్రిటన్ కు వ్యాపించిన ఈ వైరస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఊహించనంత వేగంగా వ్యాపిస్తుండడంతో….వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనే దానిపై శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు.

సర్వత్రా ఆందోళన నెలకొన్న ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ ఊరటనిచ్చే వార్త చెప్పింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై కొవిడ్ టీకాలు పని చేస్తున్నాయని దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు కొద్దిమందిలోనే ఈ వేరియంట్ ను గుర్తించినట్లు వెల్లడించింది. ఉత్పరివర్తనాల వల్ల వైరస్ వ్యాగంగా వ్యాప్తి చెందుతోందని హెచ్చరించింది. అటు.. ఓమిక్రాన్ కు 100 రోజుల్లో బూస్టర్ డోసు తయారు చేయనున్నట్లు మోడెర్నా తెలిపింది. కొత్త వేరియంట్ పై ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ కూడా పరిశోధనలు ప్రారంభించాయి


తగ్గిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. తాజాగా రూపం మార్చుకుని జనాలపై దాడికి సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాలో బీ 1.1.529 కరోనా వేరియంట్ ను గుర్తించారు. 32 మ్యుటేషన్లు ఉన్న ఈ వేరియంట్ కు ‘ఒమిక్రాన్’గా పేరు పెట్టారు. దీన్ని ప్రమాదకరమైన వేరియంట్ గా వైద్య నిపుణులు గుర్తించారు. డెల్టా కంటే ప్రమాదకరమైన ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగి ఉంది. దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోట్స్ వానా దేశాల్లో ఈ వేరియంట్ కనిపించింది. ఆ తర్వాత బెల్జియం, ఇజ్రాయెల్, ఇప్పుడు బ్రిటన్ దేశాల్లో కూడా ఈ వేరియంట్ వెలుగు చూడటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ వేరియంట్ ను గుర్తించిన దేశాలపై ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి.

ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో దక్షిణాఫ్రికాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో వేరియంట్ వెలుగుచూడగానే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్, ఇతర యూరప్ దేశాలు, అమెరికా…. దక్షాణాఫ్రికాతో పాటు ఇతర ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. ఇది అన్యాయమైన చర్యని దక్షిణాఫ్రికా, భయాందోళన చెందవద్దని WHO అంటున్నా ..గతంలో కరోనా కల్లోలాన్ని అనుభవించిన దేశాలు ముందు జాగ్రత్త పాటిస్తున్నాయి. మరోవైపు మన దేశంలో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో పక్కాగా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.

Flash...   Rekha Jhunjhunwala: ఆమె నాలుగు గంటల్లో 482 కోట్లు స్మపాదించారు .. ఎలాగో తెలుసా ?

కాగా.. రోగనిరోధక వ్యవస్థ పని చేయని, చికిత్స పొందని హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రోగి నుంచి వేరియంట్ వ్యాపించిందని గుర్తించడం.. వ్యాక్సిన్లకు, యాంటీబాడీలకు లొంగదన్న ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయకంపితులను చేస్తోంది. వ్యాక్సిన్ల ద్వారా శరీరంలో ఉండే యాంటీబాడీలు, గతంలో కరోనా సోకిన వారికి ఉండే యాంటీబాడీలు అన్నింటినీ కొత్త వేరియంట్ లొంగదీసుకుంటోంది. సరిగ్గా చెప్పాలంటే…వ్యాక్సిన్ వేయించుకున్నా మాములే.. ఒకసారి వైరస్ బారిన పడ్డాక మళ్లీ రాదులే అన్న ధీమా ఏమాత్రం ఉండకూడదు. ఎవ్వరి మీదైనా ఒమిక్రాన్ దాడి చేయవచ్చు. అంతే కాదు…ఒకసారి ఈ వేరియంట్ సోకిన వారికి మళ్లీ మళ్లీ సోకే ప్రమాదం కూడా పొంచి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.