Aliens News: ఆకాశంలో అంతుచిక్కని నాలుగు చుక్కలు.. వారి నుంచి వచ్చిన పిలుపేనా..?

 Aliens News: ఆకాశంలో అంతుచిక్కని నాలుగు చుక్కలు.. వారి నుంచి వచ్చిన
పిలుపేనా..?


Aliens News: అనంత విశ్వంలో.. సైన్స్‌కు అందని రహస్యాలు, అద్భుతాలు ఎన్నో
ఉన్నాయి. అవి మన ఊహలకు, అంచనాలకు ఏమాత్రం అందవు..! అలా సూపర్‌పవర్‌గా భావించే
వాటిలో ఒకటే ఏలియన్స్‌..! అవి అసలు ఉన్నాయో లేవో తెలియదు కానీ… ఆ ప్రస్తావన
వచ్చినప్పుడల్లా… ఏదో ఓ ఉత్కంఠ, ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. అందుకే
దశాబ్దాల అన్వేషణలో గ్రహంతరవాసులకు సంబంధించి.. ఏ ఒక్క ఆధారం దొరక్కపోయినా…
వెతుకులాట మాత్రం ఆగడం లేదు. తాజాగా.. ఏలియన్స్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన
విషయం వార్తల్లోకి వచ్చింది. ఆకాశంలో ఓ యూఎఫ్ఓ చక్కర్లు కొట్టిన వీడియో
ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఇంతకీ.. అది నిజంగానే ఏలియన్స్‌
పంపిన యూఎఫ్ఓ నేనా.. లేక ఏయిర్‌ క్రాఫ్టా..?

చదవండి :మీ ఫోన్‌లో స్టోరేజీ పూర్తిగా నిండిపోయిందా..?

యూఎఫ్ఓ అంటే.. Unidentified flying object అని అర్థం. ఆకాశంలో ఎగురుతూ
కనిపించే గుర్తు తెలియని వస్తువు లేదా ఏలియన్స్‌ యొక్క ఫ్లైయింగ్‌ మిషిన్‌
అని అర్థం. అయితే ఏదైన ఏయిర్‌ క్రాఫ్ట్‌ లేదా స్పేస్‌ షిప్‌లు గాల్లోకి ఎగిరే
ముందుకు అందుకు సంబంధించిన రాడర్‌ సిగల్స్‌ ఉంటాయి. యూఎఫ్ఓ వంటి వాటికి
అలాంటి ఏమి ఉండదు. అయితే కొన్ని సార్లు రాడర్లకు సంబంధించిన సిగ్నల్‌ కాకుండా
వింత మిషెన్లు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుంటాయి. అలాంటి వాటివి ఇతర గ్రహాల
నుంచి మిషెన్‌గా భావిస్తుంటారు సైంటిస్టులు. అయితే ఈ భూమిపై నుంచి ఎలాంటి
ఫ్లైట్‌ లేదా స్పేస్‌ షిప్‌ ఎగిరిగినా అందుకు సంబంధించిన రాడర్‌ సిగ్నల్స్‌
అంటూ ఉంటాయి. వాటిని ఈజీగానే ఐడెంటీ ఫై చేస్తుంటారు పైలెట్స్‌. అయితే తాజాగా
ఓ పైలెట్‌ ఆకాశంలో వింత ఆకారంలో ఓ యూఎఫ్ఓ కనిపించింది.

చదవండి :ప్రధాన మంత్రి మోడీ twitter అకౌంట్ హాక్ 

ఓ పైలెట్ పసిఫిక్‌ మహాసముద్రం మీదుగా విమానంలో ప్రయాణిస్తున్నాడు. కొంత దూరం
ప్రయాణించాక.. నాలుగు చుక్కలు ఒకదాని పక్కన ఒకటి ప్రయాణిస్తూ కనిపించాయి.
ఆశ్చర్యానికి గురైన పైలెట్.. వెంటనే ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు.
అయితే కొంత దూరం ప్రయాణించిన ఆ చుక్కలు.. ఒక్కసారిగా అదృశ్యమవుతాయి. అవి
ఏలియన్స్ యూఎఫ్ఓ లని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యూఎఫ్‌వోలకు
సంబంధించిన వీడియోలు గతంలో చాలా సార్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉందంటూ
పలువురు పేర్కొంటున్నారు.

A pilot claims he saw a fleet of #UFOs over the Pacific Ocean. The video was shot at around 39,000 feet. 🛸👽

The suspected #alien aircraft took the form of ‘weird’ rotating lights moving across the sky. 😳

What are your thoughts on the footage? 👀🤔 pic.twitter.com/N0I2WS2kYq

— Chillz TV (@ChillzTV) December 7, 2021

ఎన్నో సంవత్సరాలుగా.. విశ్వంలో ఏలియన్స్ ఉన్నారని.. వారికి మనుషుల కంటే అధిక
శక్తులు.. టెక్నాలజీ గురించి తెలుసని చాలా కాలంగా శాస్త్రవేత్తలు అంచనా
వేస్తున్నారు. గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అన్న చర్చ ఈనాటిది కాదు. ఎప్పటి
నుంచో ఈ విషయంపై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది యూఎఫ్ఓ లను
చూశామని ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. అయితే మనం ఏదివిధంగా అయితే ఇతర గ్రహాల్లో
ఏలియన్స్‌ ఉన్నాయని, భావిస్తూ.. పరిశోధనలు చేస్తున్నామో.. అదే విధంగా
ఏలియన్స్‌ కూడా మనల్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నాయన్న వాదన కూడా ఉంది.
అయితే ఏలియన్స్‌ మనకంటే టెక్నాలజీ పరంగా చాలా ముందు ఉండి ఉంటారని చాలా మంది
సైంటిస్టులు తెలిపారు. అలాంటప్పుడు ఏలియన్స్‌ మనల్ని కలవడం ఎందుకని సాధ్యం
కావడం లేదని ఇంకొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నిజంగానే
ఏలియన్స్‌ ఆకాశం చక్కర్లు కొట్టాయని అనుకుంటే.. అవి భూమి మీదకు ఎందుకని
రాలేకపోతున్నాయని అంటున్నారు.

Flash...   Magnesium Deficiency: నిద్ర సరిగా పట్టడం లేదా? ఆకలి లేదా?.. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి