Amazon: ఇయర్ ఎండ్ సేల్‌ని ప్రకటించిన అమెజాన్.. FULL DISCOUNTS

 Amazon: ఇయర్ ఎండ్ సేల్‌ని ప్రకటించిన అమెజాన్.. OnePlus, Xiaomiతో సహా ఈ ఫోన్లపై భారీ తగ్గింపు..

Amazon: అమెజాన్‌ ఇయర్‌ ఎండ్‌ సేల్‌ని ప్రకటించింది. ఈ సేల్‌లోఅనేక స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీలు, టీవీలపై ఆఫర్‌లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ ఇయర్-ఎండ్ సేల్ డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. Redmi 9A, Redmi Note 10S, Xiaomi 11 Lite NE 5G, Samsung Galaxy M సిరీస్, Samsung Galaxy S20 FE 5G, Realme Narzo 50A, OnePlus Nord CE వంటి కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై కొనుగోలుదారులు 40 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలుదారులు రూ.1,500 వరకు తగ్గింపును పొందవచ్చు. వారు తమకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలపై 12 నెలల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMIలను పొందవచ్చు. సేల్ సందర్భంగా చాలా ఫోన్లపై అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తోంది. సేల్ సమయంలో OnePlus Nord 2 , Nord CE భారీ తగ్గింపులను పొందుతాయని అమెజాన్ వెల్లడించింది. Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్‌లు, ICICI, Kotak కార్డ్‌లపై కొనుగోలుదారులు రూ. 1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. వారు ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లను, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై 3 నెలల వరకు నో కాస్ట్ EMIని కూడా పొందవచ్చు.

Amazon ICICI, Kotak బ్యాంక్ కార్డ్‌లతో OnePlus 9 సిరీస్‌పై రూ.8,000 వరకు తగ్గింపు, ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ల మార్పిడిపై అదనంగా రూ.5,000 తగ్గింపును అందిస్తోంది. స్మార్ట్ టీవీల గురించి మాట్లాడితే.. 32-అంగుళాల నుంచి 55-అంగుళాల వరకు ఉన్న OnePlus టీవీలు విక్రయ సమయంలో రూ.15,455 నుంచి అందుబాటులో ఉన్నాయి. ధరలో ICICI క్రెడిట్ కార్డ్‌పై తగ్గింపు ఉంటుంది. Redmi 9A, Redmi Note 10Sతో సహా అత్యధికంగా అమ్ముడైన Xiaomi స్మార్ట్‌ఫోన్‌లపై Amazon ఆఫర్లను అందిస్తోంది. Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం అదనపు బ్యాంక్ ఆఫర్‌లతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

Flash...   త్వరలో 1,180 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

ఇటీవల ప్రారంభించిన Xiaomi 11 Lite NE 5G కూడా ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో రూ. 2,500 తక్షణ బ్యాంక్ తగ్గింపుతో అందుబాటులో ఉంటుంది. కస్టమర్‌లు దీనిని రూ. 24,500కి పొందవచ్చు. Mi 11X Pro, Mi 11X వంటి ఫ్లాగ్‌షిప్ Mi ఫోన్‌లపై కొనుగోలుదారులు రూ. 2,500 వరకు తగ్గింపు పొందవచ్చు. Xiaomi 32-అంగుళాల నుంచి 55-అంగుళాల వరకు అత్యధికంగా అమ్ముడవుతున్న అనేక టెలివిజన్‌లను కలిగి ఉంది. దీని ధరలు రూ.14,999 నుంచి ప్రారంభమవుతాయి.

CLICK HERE FOR OFFERS