AMERICA : అమెరికాలో Delmicron కలకలం…!

 అమెరికాలో Delmicron కలకలం…!

డెల్టా వేరియంట్‌ను, ఒమిక్రాన్‌ను కలిపి డెల్మిక్రాన్‌గా పిలుస్తున్నారు. ఇది కొత్త వేరియంట్ కాకపోయినా… డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల స్పైక్‌ ప్రొటీన్ల కలయికగా నిపుణులు చెప్తున్నారు.

అమెరికా, బ్రిటన్‌లో కరోనా కేసులు మళ్లీ పీక్స్‌కు చేరుతున్నాయి. అగ్రరాజ్యంలో ఒక్కరోజే నమోదైన కొత్త కేసులు 2 లక్షల మార్క్‌ను దాటేయగా… బ్రిటన్‌లో వరుసగా రెండోరోజూ లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ లేటెస్ట్‌ వేవ్‌ వెనుక డెల్మిక్రాన్‌ ఉండొచ్చనే వాదనను తెరపైకి తెచ్చారు… నిపుణులు.

అమెరికాలో 24 గంటల్లో 2 లక్షల 65 వేల 32 మందికి కొవిడ్ సోకింది. ఈ ఏడాది జనవరి, సెప్టెంబర్‌ తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. అమెరికాలో ఒమిక్రాన్ బారినపడే వారి సంఖ్య కూడా 73 శాతానికి పెరిగింది. ఇక బ్రిటన్‌లోనూ ఒక్కరోజే దాదాపు లక్షా 20 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అక్కడ వరుసగా రెండోరోజు లక్షకు పైన కేసులు తేలాయి. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, కెనడాల్లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ తాజా వేవ్‌ వెనుక డెల్మిక్రాన్ ఉందని నిపుణులు అంటున్నారు.

డెల్టా వేరియంట్‌ను, ఒమిక్రాన్‌ను కలిపి డెల్మిక్రాన్‌గా పిలుస్తున్నారు. ఇది కొత్త వేరియంట్ కాకపోయినా… డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల స్పైక్‌ ప్రొటీన్ల కలయికగా నిపుణులు చెప్తున్నారు. ఒక వ్యక్తికి ఒకే సమయంలో డెల్టాతో పాటు ఒమిక్రాన్ కూడా సోకితే డెల్మిక్రాన్‌గా పరిగణిస్తారు. అలాగే డెల్టా నుంచి కోలుకుంటున్న వ్యక్తికి .. ఒమిక్రాన్‌ సోకితే డెల్మిక్రాన్‌ ఇన్ఫెక్షన్‌గా చెబుతారు. ఇది చాలా అరుదుగా జరగొచ్చని నిపుణులు అంటున్నారు. ఒకటి కంటే ఎక్కువ కరోనా వైరస్ వేరియంట్ల బారినపడిన వారికి దగ్గరగా వెళ్లిన వారిలో ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చని చెబుతున్నారు.

డెల్టా, ఒమిక్రాన్ బారినపడిన వ్యక్తుల్లో కాస్త అటూ ఇటుగా ఒకే రకమైన లక్షణాలు ఉంటున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటివి వస్తున్నాయి. డెల్టా కంటే ఒమిక్రాన్‌ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉండటంతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాలు స్వల్పంగానే ఉన్నాయి. అయితే, రోగనిరోధక శక్తి లేకపోవడం, వృద్ధాప్యం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి… డబుల్ ఇన్ఫెక్షన్‌తో ముప్పు ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందరూ కొవిడ్ నియమావళిని పాటించడం, టీకాలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని సూచిస్తున్నారు

Flash...   నెలకు రూ.11 వేలు ఇస్తోన్న SBI.. 10 ఏళ్ల పాటు పొందొచ్చు.. ఈ స్కీమ్‌లో ఎలా చేరాలంటే?