AP లో వారందరికి శుభవార్త.. నేడు అకౌంట్‌లలో డబ్బులు జమ

 


ఏపీలో వారందరికి శుభవార్త.. నేడు అకౌంట్‌లలో డబ్బులు జమ

ఏపీలో అర్హత ఉండి పథకాలు రానివారికి మరో అవకాశం

నేడు అకౌంట్‌లలో డబ్బు జమ చేయనున్న ప్రభుత్వం

మొత్తం రూ.730 కోట్లు విడుదల చేయనున్న సీఎం జగన్

ఏపీలో పథకాలకు అర్హత ఉన్నా పొందలేకపోయినవారికి శుభవార్త. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేయనున్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరోసారి వెరిఫికేషన్‌ చేసి.. ఏటా జూన్, డిసెంబర్‌లలో సంక్షేమ పథకాల లబ్ధి అందజేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం వారికి డబ్బులు జమ చేస్తున్నారు.

వివిధ ప్రభుత్వ పధకాలకు అర్హులో కాదో  తెలుసుకొనుటకు  ఇక్కడ క్లిక్ చేయండి 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,30,809 మంది లబ్ధిదారులకు రూ.703 కోట్లను జమ చేయనున్నారు. 3,44,497 మందికి పెన్షన్‌ కార్డులు, 3,07,599 మందికి బియ్యం కార్డులు, 1,10,880 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్లపట్టాల లబ్ధిదారులతో కలిపి మొత్తంగా 18,47,996 మందికి ప్రయోజనం కల్పించనున్నారు.

వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ (మహిళలు), వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహన మిత్ర, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, వైఎస్సార్‌ నేతన్న నేస్తం, పెన్షన్‌ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పథకాల కింద నేడు లబ్ధి పొందనున్న వారి సంఖ్య 18,47,996.

పథకాలకు అర్హులై ఉండి లబ్ధి పొందని వారు.. సంక్షేమ పథకం అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులు పరిశీలించి, అర్హులైన వారికి డిసెంబర్‌ నుండి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి జూన్‌లో లబ్ధి కల్పిస్తారు. జూన్‌ నుండి నవంబర్‌ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి డిసెంబర్‌లో లబ్ధి కల్పిస్తారు.

Flash...   1300 పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్ ప్రోగ్రాం "సంకల్పం" ద్వారా అమలు చేయాలని ఆదేశాలు . స్కూల్ లిస్ట్ ఇదే..