AP లో సినిమా టికెట్ల కొత్త రేట్లు ఇవిగో!

 ఏపీలో సినిమా టికెట్ల కొత్త రేట్లు ఇవిగో!

➤ ఏపీలో కొత్తగా ఆన్ లైన్ సినిమా టికెటింగ్

➤ ఇటీవల చట్ట సవరణ బిల్లు తీసుకువచ్చిన సర్కారు

➤ నేటి నుంచి కొత్త రేట్లు

➤ అత్యల్ప టికెట్ ధర రూ.5


సర్కారు ఇటీవల ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా టికెట్ల కొత్త రేట్లను నేడు ప్రకటించింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ప్రాంతాల్లోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లకు వివిధ రకాల రేట్లను నిర్దేశించింది. సవరించిన ధరల ప్రకారం… అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250గా పేర్కొన్నారు. అంతేకాదు, ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని తెలుస్తోంది.

మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో…

➧ మల్టీప్లెక్సు- ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75

➧ ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40

➧ నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20

మున్సిపాలిటీ ప్రాంతాల్లో…

➧ మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60

➧ ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30

➧ నాన్ ఏసీ- ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15

నగర పంచాయతీల్లో…

➧ మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40

➧ ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15

➧ నాన్ ఏసీ- ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10

గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో…

➧ మల్టీప్లెక్స్-  ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30

➧ ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10

➧ నాన్ ఏసీ- ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5

Flash...   IBPS PO Admit Card: PO మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి