AP PRC : రేపే పీఆర్సీ?


♦ రేపే పీఆర్సీ?

♦ 𝟑𝟎-𝟑𝟒 శాతం మధ్య ఖరారు?

♦ ఉద్యోగులకు తీపికబురే

♦ రేపు సీఎం జగన్ తో సమావేశం 

♦ పుట్టినరోజు వేళ ప్రకటన?

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం పీఆర్సీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం ఉద్యోగ సంఘ నేతలతో మరోసారి ప్ర భుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు భేటీ కానున్నారు. కీలకమైన ఈ భేటీ అనంతరం మంగళవారం సీఎం జగన్తో ఉద్యోగ సంఘ నేతలు సమావేశం కానున్నారు. ఈ మేరకు నేడు జరిగే చివరి దఫా చర్చల్లో పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాతే ఉద్యోగ సంఘాలతో సీఎంజగన్ సమావేశమై పీఆర్సీపై అధికారికంగా ప్రకటన ఇవ్వనున్నారు. గడిచిన వారం రోజుల్లో మూడుసార్లు ఉద్యోగ సంఘం నేతలతో సజ్జల, బుగ్గనలు భేటీ అయి వారి డిమాండ్లపై చర్చించారు. ఇదే సందర్భంలో రెండుసార్లు సజ్జల, బుగ్గనలు సీఎంతో భేటీ అయి ఉద్యోగ సంఘ నేతలతో జరిపిన చర్చలు, తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గడిచిన రెండు, మూడు రోజులుగా ప్రభుత్వం పీఆర్సీ అంశంపై లోతుగా చర్చించి. ఉద్యోగ సంఘాలను సంతృప్తి పరిచేలా 𝟑𝟎 నుంచి 𝟑𝟒 శాతం పీఆర్సీని ప్రకటించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. అయితే చర్చల్లో భాగంగా ఉద్యోగ సంఘాలు తమకు 𝟓𝟎 శాతం తక్కువ లేకుండా పీఆర్సీని ప్రకటించాలనిడిమాండ్ చేశాయి. ఇదే సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎస్ కమిటీ సూచించిన విధంగా 𝟏𝟒.𝟐𝟗 శాతం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు ఉద్యమం బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే చర్చల అనంతరం ఉద్యోగ సంఘాలు సూచించిన 𝟕𝟏 డిమాండ్లను పరిశీలించి వాటిని దశల వారీగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామని, ప్రభుత్వం తరపున సజ్జల హామీ ఇచ్చారు. సీఎం జగన్ కూడా ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారని, పీఆర్సీ విషయం లో కూడా మంచి నిర్ణయమే తీసుకోబోతున్నారని స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగ సంఘా లు తమ ఆందోళనలను తాత్కాలి కంగా విరమించుకున్నారు. 

Flash...   Postal Jobs: 38926 JOBS in the Postal Department

♦నేడు కీలక భేటీ

ఉద్యోగ సంఘ నేతలతో సోమవారం మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సమావేశం కానున్నారు. గత గురువారం నాడు జరిగిన మూడవ భేటీలో ఉద్యోగ సంఘాలతో ‘సమావేశమైన ఆ ఇద్దరు నేతలు వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు రోజు సుదీర్ఘంగా ఆరు గంటలకు పైగా చర్చలు జరిగాయి. తొలిరోజు కూడా ఆరున్నర గంటలకు పైగా సమావేశం సాగింది. అయితే మూడు సమావేశాల్లో ఉద్యోగ సంఘ డిమాండ్లను, సమస్యలను విన్న సజ్జల, బుగ్గనలు అన్ని అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. 𝟕𝟏 డిమాండ్లలో పీఆర్సీ అంశంతో సహా 𝟏𝟎 డిమాండ్లు మాత్రమే ఆర్థిక అంశాలకు సంబంధించినవి కాగా, మిగతా 𝟔𝟏 అంశాలు ఆర్థికేతర అంశాలే. వీటితో పాటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను, ఉద్యోగ సంఘ నేతలకు గతంలో ఎదురైన అనేక ఇబ్బందికర పరిస్థితులను ఈ సందర్భంగా సజ్జల దృష్టికి ఈ తీసుకెళ్లారు. అన్ని అంశాలను సానుకూలంగా ఉన్నప్రభుత్వ ప్రతినిధులు రెండు, మూడు రోజుల్లోనే పీఆర్సీ అంశాన్ని పూర్తి చేస్తామని, ఆ తర్వాత దశల వారీగా మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సోమవారం జరిగే కీలకమైన సమావేశంలో పై అంశాలను మరోసారి చర్చించి సీఎం జగన్ తీసుకోబోతున్న నిర్ణయాలను సజ్జల భేటీలో ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేయబోతున్నారు.

 ♦రేపు తుది నిర్ణయం

పీఆర్సీ తక్షణమే ప్రకటించాలని గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న ఉద్యోగ సంఘాలు తొలిసారిగా సీఎం జగన్ ను తిరుపతిలో కలిశా రు. వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన సీఎం జగన్ ను ఉద్యోగ సంఘాలు కలిసి పీఆర్సీ అంశాన్ని పరిశీలిం చాలని రేణిగుంట ఎయిర్పోర్టు లోనే వినతిపత్రాన్ని సమర్పిం చారు. ఆ తర్వాతే చర్చలు జరి గాయి. ముచ్చటగా మూడుసార్లు ప్రభుత్వం తరపున సజ్జల, బుగ్గనలు ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు.

అదే సందర్భంలో రెండు సార్లు ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల అంశాన్ని సీఎం | జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఉద్యోగ సంఘాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఆర్సీపై మంగళ వారం సీఎం జగన్ అధికారిక ప్రకటన చేయనున్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఉద్యోగులకు తీపి కబురు అందించాలని, ఆ దిశగా పీఆర్సీని ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన 𝟓𝟎 శాతం సాధ్యం కాదని చర్చల సంద ర్భంలోనే ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. ఇదే సందర్భం లో సీఎస్ కమిటీ సూచించిన 𝟏𝟒.𝟐𝟗 శాతంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపధ్యంలో అందరికి ఆమోదయోగ్యమైన విధంగా 𝟑𝟎 నుంచి 𝟑𝟒 శాతం పీఆర్సీని ప్రకటించే దిశగా సీఎం జగన్ నిర్ణయం  ఉంటున్నట్లు తెలిసింది.

Flash...   Midhani Recruitment: మిధానీలో ఉద్యోగాలు.. రాత పరీక్షా లేకుండా..