AP ప్రజలకు శుభవార్త.. ట్రూఅప్‌ ఛార్జీలు తిరిగి వచ్చేస్తున్నాయి.

 ఏపీ ప్రజలకు శుభవార్త.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం, ఆ డబ్బులు వెనక్కు!


ఏపీలో విద్యుత్‌ వినియోగదారులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ట్రూఅప్‌ ఛార్జీలు (ఇంధన సర్దుబాటు ఛార్జీలు) కింద వసూలు చేసిన డబ్బు వినియోగదారులకు తిరిగి వచ్చేస్తున్నాయి. నవంబర్‌లో వినియోగానికి సంబంధించి డిసెంబర్‌ నెల బిల్లుల్లో ఆ మేరకు చార్జీలు తగ్గాయి. ట్రూ అప్‌ చార్జీల కింద వసూలు చేసిన మొత్తాన్ని విద్యుత్‌ బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. తాజాగా విద్యుత్‌ బిల్లులను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది.

చదవండి : ట్రూ అప్ Charges  అంటే ఏమిటి ?

2014–15 నుంచి 2018–19 కాలానికి సంబంధించి ఏపీఈపీడీసీఎల్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూ అప్‌ ఛార్జీల పిటిషన్ల ఆధారంగా ఏపీఈఆర్‌సీ గత ఆగష్టు 27న రూ.3,669 కోట్ల ట్రూ అప్ ఛార్జీల వసూలుకు అనుమతినిచ్చింది. ఏపీఎస్పీడీసీఎల్‌ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్‌ రూ.609 కోట్ల మేర ఎనిమిది నెలల్లో వసూలు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్‌ బిల్లులలో ఛార్జీలు విధించారు. కానీ న్యాయపరమైన ఇబ్బందులతో ఏపీఈఆర్‌సీ ఆదేశాలను వెనక్కి తీసుకుంది.

అందుకే విద్యుత్‌ బిల్లులు ట్రూఅప్‌ ఛార్జీలు లేకుండానే వినియోగదారులకు అందుతున్నాయి. వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన ట్రూఅప్‌ చార్జీలను బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో నవంబర్‌ నెల బిల్లుల నుంచే ట్రూ అప్‌ ఛార్జీలను వినియోగదారులకు తిరిగి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించారు. ఏపీఈపీడీసీఎల్‌ డిసెంబర్‌ నుంచి చేపట్టింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 1.86 కోట్ల మంది వినియోగదారులకు ఊరట లభించింది

Flash...   Elections 2024: ఓటరు జాబితాలో మీ పేరుందా.? ఇలా ఒక్క నిమిషం లో చూసుకోండి !