CM Jagan : ఆదాయం తగ్గింది, ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది

 CM Jagan : ఆదాయం తగ్గింది, ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది

CM Jagan : కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిందని సీఎం జగన్ అన్నారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రూ.30వేల కోట్ల భారం పడిందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీలో జగన్ చెప్పారు. వైరస్ నివారణ, నియంత్రణకు అదనంగా రూ.8వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల సహకారంతోనే అనేక వనరులు సమకూర్చకున్నామని.. రైతులు, ఇళ్ల లబ్దిదారులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు సీఎం జగన్.

తెలుసుకోండి : తుఫాన్‌లు ఎలా ఏర్పడతాయి? అల్పపీనడం, వాయుగుండం మధ్య తేడా ఏంటి.. తీరం దాటడం అంటే?

థర్డ్ వేవ్, ఒమిక్రాన్ భయాల కారణంగా ఆర్థిక స్థితి కాస్త మందగించిందని, లేకుంటే చాలా వేగంగా పుంజుకునేదని జగన్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధి సహా అన్ని రంగాల్లో పురోగమించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రక్రియలో బ్యాంకర్లు ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు అందేలా చూడాలన్నారు. బ్యాంకుల సహకారంతోనే రాష్ట్ర ఆర్థిక స్థితి గట్టెక్కిందన్నారు జగన్.

Flash...   AP లో పదవ తరగతి తో అటెండర్, వాచ్ మెన్ ఉద్యోగాలు .. అప్లై చేయండి