Corona Virus: ఆ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి కరోనా తొందరగా సోకుతుందట..

 Corona Virus: ఆ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి కరోనా తొందరగా సోకుతుందట.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..

గత రెండేళ్లుగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి. కోవిడ్ మహమ్మారి ప్రభావంతో ఎన్నో దేశాల్లో తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మరి ప్రకంపనలు సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు మరోసారి వేగంగా పెరిగాయి. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నప్పటికీ కోవిడ్ సోకుతుంది. చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ ఈ మహమ్మారి వ్యాపిస్తోంది. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికీ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇటీవల గత కొద్ది రోజులుగా యావత్ ప్రపంచాన్ని ఒమిక్రాన్ వైరస్ భయందోళనలకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. జాగ్రత్తలు తప్పనిసరి అంటూ కేంద్రం హెచ్చరిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ అధ్యయనంలో కరోనా ప్రభావం బ్లడ్ గ్రూప్స్ ప్రకారం కూడా ఉంటుందని పేర్కోంది. అధ్యయనం ప్రకారం… ఏ, బీ, Rh(+) బ్లడ్ గ్రూపులు ఉన్న వ్యక్తులు చాలా తొందరగా కోవిడ్ భారిన పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే AB, O, Rh (-) బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి కరోనా సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉందని తేలీంది.

డిపార్ట్‏మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్‏ఫ్యూజన్ మెడిసిన్.. సర్ గంగారామ్ హాస్పిటల్.. ఢిల్లీ నిర్వహించిన ఈ అధ్యయనంలోని ఫలితాలు ఫ్రాంటియర్స్ ఇన్ సెల్యూలార్ అండ్ ఇన్ఫెక్షన్ మైక్రోబయాలజీ నవంబర్ 2021 ఎడిషన్ లో ప్రచురించబడ్డాయి. ఏప్రిల్ 8, 2020, అక్టోబర్ 4, 2020 మధ్య గంగా రామ్ హాస్పిటల్‌లో చేరిన 2,586 కోవిడ్-19 పాజిటివ్ రోగులపై ఈ అధ్యయనం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన వెబ్‌సైట్‌లో కూడా ఈ అధ్యయనాన్ని ప్రచురించింది.

సర్ గంగారామ్ హాస్పిటల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ విభాగం (రక్తమార్పిడి విభాగం) డాక్టర్ వివేక్ రంజన్ మాట్లాడుతూ..బీ ప్లస్ గ్రూప్ ఉన్న పురుషులకు కూడా కరోనా తొందరగా సోకుంతుందని తెలిపారు. అలాగే మహిళల కంటే పురుషులకు కోవిడ్ సోకే ప్రమాదం ఎక్కువ. అలాగే బీ, ఏబీ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల వ్యక్తులకు.. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కోవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలీంది.

Flash...   RD Account: రూ.5 వేల పొదుపుతో చేతికి రూ.3 లక్షల 72 వేలు.. ఈ బ్యాంకులతో

బ్లడ్ గ్రూప్ A, Rh+ ఉన్న రోగులు కరోనా నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందని.. O బ్లడ్ గ్రూప్ ఉన్నవారు త్వరగా కోలుకున్నారని అధ్యయనంలో తేలీంది. ఈ వ్యక్తులలో చాలా కాలం వరకు కోవిడ్ లక్షణాలు కనిపించవు. వివిధ బ్లడ్ గ్రూప్స్.. కరోనా వైరస్ కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి అధ్యయనం చేసినట్లుగా పేర్కోన్నారు. కరోనా నుంచి కోలుకోవడానికి పట్టే సమయం.. మరణాల రేటు గురించి ఈ అధ్యయనంలో పరిశోధించారు.