Curd Side Effects: ఈ వ్యక్తులు పెరుగు అస్సలు తినకూడదు.. విషంతో సమానమట…
పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే మంచి బ్యాక్టీరియాను వృద్ది చేసే ప్రోబయోటిక్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కొందరి ఆరోగ్యానికి పెరుగు మంచిది కాదు. మరి ఎవరెవరు పెరుగు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగు తినడం ద్వారా మీ శరీరానికి కావల్సినంత కాల్షియం లభిస్తుంది. తద్వారా మీ ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. కానీ మీకు ఆర్థరైటిస్(Arthritis) సమస్య ఉంటే పెరుగు అస్సలు తినకూడదు. ఒకవేళ తినట్లయితే.. మీ సమస్య మరింతగా పెరుగుతుంది
జీర్ణవ్యవస్థకు పెరుగు చాలా మంచిదని వైద్యులు అంటుంటారు. అయితే మీకు అసిడిటీ సమస్య ఉన్నట్లయితే పెరుగు అస్సలు తినకండి. ఒకవేళ తింటే మీకు అజీర్ణం కావొచ్చు. రాత్రి సమయాల్లో పెరుగును తినొద్దు.
అస్తమా లేదా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే పెరుగుకు పూర్రిగా దూరంగా ఉండాలి. శీతాకాలంలో పెరుగు కారణంగా మీరు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు
ఎవరైనా లాక్టోస్ ఇన్‌టాలరెన్స్(Lactose Intolerance)తో బాధపడుతున్నట్లయితే.. వారు పెరుగును తినవద్దు. అతిసారం లేదా కడుపు నొప్పి సమస్య రావొచ్చు. అలాగే ఈ రోగులు పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండటం మంచిది.