Electric Bikes: గంటకు రూ. 50 చెల్లిస్తే ఎలక్ట్రిక్‌ బైక్‌..! ఎగబడుతున్న జనాలు..!

 గంటకు రూ. 50 చెల్లిస్తే ఎలక్ట్రిక్‌ బైక్‌..! ఎగబడుతున్న జనాలు..!

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలపై భారీ ఆదరణ లభిస్తోంది. సంప్రాదాయ వాహనాలకు చెక్‌పెడుతూ ఎలక్ట్రిక్‌ వాహనాలకే మొగ్గుచూపుతున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను వాడకంలో తెచ్చేందుకుగాను భారతీయ రైల్వేస్‌ కూడా సరికొత్తగా ప్రయాణికులకు ఈ-బైక్‌ రెంటల్‌ బైక్‌ సర్వీసులను ప్రారంభించింది. గంటకు రూ. 50 చెల్లిస్తే ఈ బైక్‌ సర్వీసులను పొందవచ్చును. 

ఈ-బైక్‌ రెంటల్‌ సర్వీస్‌ ఎక్కడంటే..!

త‌మిళ‌నాడులోని తిరుచ్చి రైల్వే స్టేష‌న్‌లో ఎల‌క్ట్రిక్ బైక్ (ఈ-బైక్) రెంట‌ల్ సేవలను ద‌క్షిణ రైల్వే అధికారులు ప్రారంభించారు. ఈ బైక్‌ సర్వీసులపై భారీ స్పందన వస్తోంది. ఉద‌యం 9 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ఈ-బైక్ రెంట‌ల్ స‌ర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఈ-బైక్‌ సేవలను పొందాలంటే ముందుగా  రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తరువాత గంట‌కు రూ.50 రెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది.వాటితోపాటుగా ఆయా వ్య‌క్తి త‌న ఆధార్ కార్డ్‌, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ ప‌త్రాలు ఇస్తే ఈ బైక్‌ సేవలను పొందవచ్చును.

Read: ఆకాశంలో అంతుచిక్కని నాలుగు చుక్కలు.. వారి నుంచి వచ్చిన పిలుపేనా..?

తిరుచ్చి రైల్వే స్టేషన్‌ తీసుకొచ్చిన ఈ-బైక్‌ రెంటల్‌ సర్వీసులపై భారీ ఆదరణ వస్తోనట్లు తెలుస్తోంది. రైల్వే ప్ర‌యాణికులే కాకుండా ఇతర వ్యక్తులు కూడా ఈ-బైక్స్ రెంటల్‌ సేవలను వాడుకోవచ్చునని తిరుచ్చి రైల్వే స్టేషన్‌ అధికారులు వెల్లడించారు. ఈ బైక్‌ను ఒక్క‌సారి ఛార్జ్‌ చేస్తే 130 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించవచ్చును. 

Flash...   NISHTHA 2.0, 3.0 Courses Re-Opened for Teachers Who Couldn’t Complete Previously