Facebook లో గాలం: ‘వీడియోలో ఉంది మీరేనా?’ లింక్‌ క్లిక్‌ చేస్తే ఫసక్‌

 Facebook లో గాలం: ‘వీడియోలో ఉంది మీరేనా?’ లింక్‌ క్లిక్‌ చేస్తే ఫసక్‌

Facebook Messenger Video Link Scam Alert: 

ఆన్‌లైన్‌ మోసాలకు భారత్‌ నెంబర్‌ వన్‌ అడ్డాగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు పెరిగిపోవడం.. కనీస అవగాహన లేకపోవడం లాంటి కారణాలతో  కొత్త తరహా ఆన్‌లైన్‌ స్కామ్‌లు తెర పైకి వస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ వీడియో స్కామ్‌ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ టార్గెట్‌గా జరిగే పిషింగ్‌ స్కామ్‌ ఇది. ఈ గాలంలో చిక్కితే గనుక.. ఫేస్‌బుక్‌ లాగిన్‌ క్రెడెన్షియల్స్‌ సహా అన్నీ వాళ్లకు తెలిసిపోతాయి. తద్వారా ఆన్‌లైన్‌ మోసగాళ్లు ఫేస్‌బుక్‌ అకౌంట్లపై పట్టు సాధిస్తారు. ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ ‘సోఫోస్‌’ ఈ స్కామ్‌కు సంబంధించి హెచ్చరిక జారీ చేసింది కూడా. విశేషం ఏంటంటే.. ఐదేళ్ల క్రితం ఇదే తరహా  స్కామ్‌ ఒకటి ఫేస్‌బుక్‌ను కుదిపేసింది కూడా. 

లింక్‌కి టెంప్ట్‌ అయితే.. 

ముందుగా ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ (మెసేజ్‌ బాక్స్‌) కు ఓ లింక్‌ పంపిస్తారు ఆన్‌లైన్‌ మోసగాళ్లు. ఆ లింక్‌ పైన ‘ఈ వీడియో ఉంది మీరేనా?’ అని రాసి  ఉంటుంది. ఆ లింక్‌ యూబ్యూట్‌ లింక్‌ మాదిరి ఉంటుంది. కాబట్టి, చాలా క్యాజువల్‌గా యూజర్‌ క్లిక్‌ చేసే అవకాశం ఉంది.  ఒక్కసారి గనుక క్లిక్‌ చేసినట్లయితే.. నేరుగా ఫేస్‌బుక్‌ లాగిన్‌కు వెళ్తుంది. ఒకవేళ ఫేస్‌బుక్‌లోకి లాగిన్‌ గనుక అయినట్లయితే.. కిస్సా ఖల్లాస్‌. 

ఫేక్‌ పేజీ.. 

అది ఫేస్‌బుక్‌ లాగిన్‌ పేజీ అనుకుంటే పొరపాటే!.  పక్కా ఫేక్‌ పేజీ.  యూజర్‌ ఇన్‌ఫర్మేషన్‌ను తస్కరించేందుకే ప్రత్యేకంగా అలా డిజైన్‌ చేసి పంపిస్తారు ఆన్‌లైన్‌ మోసగాళ్లు. ఒకవేళ అక్కడ లాగిన్‌ గనుక అయితే పాస్‌వర్డ్‌తో సహా అన్నీ వాళ్లకు తెలిసిపోతాయి. వెంటనే ఫేస్‌బుక్‌ అకౌంట్‌ మీద పట్టు సాధించి.. ఆపై బ్లాక్‌మెయిల్‌కు, మోసాలకు దిగుతారు.  

గుర్తుపట్టడం ఎలా?

ఆ ఫేస్‌బుక్‌ లాగిన్‌ లింక్‌ ఫేక్‌ లేదా ఒరిజినల్‌ అని గుర్తుపట్టడం ఎలా?. వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ ఒక్కటే మార్గం. లింక్‌ పైన యూఆర్‌ఎల్‌లో HTTPS లేదంటే HTTPతో మొదలైందంటే.. అది ఒరిజినల్‌ అని గుర్తు పట్టొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ మధ్యకాలంలో సేఫ్‌ ప్రొటోకాల్‌ కింద వెబ్‌సైట్లు అన్నీ HTTPS యూఆర్‌ఎల్‌ను కచ్చితంగా ఫాలో అవుతున్నాయి కాబట్టి. మోసపోయి ఫిర్యాదులు చేయడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 

Flash...   1000 కి పైగా అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ ఇతర ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల