FAST CHARGING MOBILE: మెరుపు చార్జింగ్ వేగంతో రానున్న మొబైల్‌!.. రికార్డులు బద్దలే

 మెరుపు చార్జింగ్ వేగంతో రానున్న మొబైల్‌!.. రికార్డులు బద్దలే..

స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థల మధ్య పోటీ తీవ్రమైంది. దీంతో కొత్తకొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీపై అన్ని కంపెనీలు దృష్టి సారించాయి. ఎక్కువ వాట్ల చార్జింగ్ వేగానికి సపోర్టు చేసేలా మొబైళ్లను తీసుకొస్తున్నాయి. 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అంటేనే.. ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితిలో ఏకంగా 165వాట్ల చార్జింగ్ సపోర్టుతో ఫోన్‌ తీసుకొచ్చేందుకు ఓ సంస్థ సర్టిఫికేషన్ పొందిందన్న సమాచారం బయటికి వచ్చింది.

చైనాలో త్వరలో విడుదల కానున్న నూబియా రెడ్ మ్యాజిక్ 7 (Nubia Red Magic 7) మొబైల్ 3సీ సర్టిఫికేట్ పొందింది. చైనా మార్కెట్లోకి ఫోన్‌ లాంచ్ చేయాలంటే ఈ సర్టిఫికేట్ తప్పనిసరి. కాగా చాట్ స్టేషన్ విబియో ద్వారా నూబియా రెడ్ మ్యాజిక్ 7 ఫోన్‌కు సంబంధించిన ఓ ఆశ్చర్యకర విషయం వెల్లడైంది. ఈ ఫోన్‌ ఏకంగా 165వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో రానుందట. ఒకవేళ ఇదే నిజమై ఈ ఫీచర్‌తో లాంచ్ అయితే.. ఫాస్ట్ చార్జింగ్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఇదే అత్యంత వేగవంతమైన చార్జింగ్ సపోర్టు ఉన్న ఫోన్‌గా రికార్డు దక్కించుకుంటుంది.

చూడండి :  అదిరిపోయే కొత్త ఫీచర్స్ తో ఈ డిసెంబర్ లో వచ్చే స్మార్ట్ ఫోన్లు ఇవే

ప్రస్తుతం నూబియా రెడ్ మ్యాజిక్ 6 ప్రో, నూబియా రెడ్ మ్యాజిక్ 6ఎస్ ఫోన్లు కూడా 120 వాట్ల స్పీడ్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఈ ఫీచర్ చైనా వేరియంట్లకు మాత్రమే ఉండగా.. అంతర్జాతీయ మోడళ్లలో 66 వాట్లనే పొందుపరిచింది నూబియా.

మరోవైపు నూబియా రెడ్ మ్యాజిక్ 7 కూడా ఫ్లాగ్‌షిప్‌ మోడ‌ల్‌గా చైనాలో విడుదల కానుంది. ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనున్న ఈ మొబైల్‌ స్క్రీన్ 165హెట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుందని అంచనా. అలాగే ఇటీవలే లాంచ్ అయిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ తేనున్నట్టు నూబియా వెల్లడించింది.

Flash...   How to check (pd account) SMC meeting amount and safety pledge on the wall amounts in CFMS

ఇక 64మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన వెనుక మూడు కెమెరాల అమరిక ఈ ఫోన్‌లో ఉండనుంది. ఇటీవలే ఈ ఫోన్‌ బ్లూటూత్ ఎస్ఐజీలోకనిపించడంతో బ్లూటూత్ 5.2 వెర్షన్‌తో పాటు 5జీ సపోర్టుతో వస్తోందని తేలింది.

తెలుసుకోండి : పది వేలలో వచ్చే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే 

షియామీ ఈ ఏడాది మొదట్లో 200వాట్ల హైపర్ చార్జ్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఈ సాంకేతికత ప్రకారం 4000ఎంఏహెచ్ బ్యాటరీ కేవలం 8 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. కానీ దాంతో ఏ మొబైల్‌ తెస్తున్నట్టు ప్రకటించలేదు. అయితే నూబియా మాత్రం షియామీకి ఇప్పటి నుంచే గట్టి పోటీనిచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. నూబియా రెడ్ మ్యాజిక్ 7 విడుదల గురించి ఆ సంస్థ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. 2022 తొలి అర్ధభాగంలో ఈ ఫోన్‌ లాంచ్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

MORE ABOUT THIS MOBILE

TE Nubia Red Magic 7 Specifications

BASIC
INFO

Brand

ZTE

Model

Nubia Red Magic 7

Status

Coming soon

Release Date

August 2022

BODY

Dimensions

168.6 x 78 x 9.8 mm
(6.64 x 3.07 x 0.39 in)

Weight

218 g (7.69 oz)

Colors

Silver, Blue/Red

Body Material

Glass front (Gorilla
Glass), glass back, aluminum frame

SIMs

Dual SIM (Nano-SIM,
dual stand-by)

Water & Dust

RGB light panel (on
the back)
Pressure sensitive zones (300Hz touch-sensing)
Built-in cooling fan

DISPLAY

Size

6.65 inches

Type

AMOLED capacitive
touchscreen, 16M colors

Resolutions

1080 x 2340 pixels,
19.5:9 ratio

PPI

388 ppi density

Multi touch

Yes

Protection

Corning Gorilla
Glass
144Hz refresh rate

NETWORKS

2G

GSM 850 / 900 / 1800
/ 1900 – SIM 1 & SIM 2
CDMA 800 & TD-SCDMA

3G

HSDPA 850 / 900 /
1900 / 2100
CDMA2000 1xEV-DO

4G

LTE (unspecified)

5G

SA/NSA

Speed

HSPA 42.2/5.76 Mbps,
LTE-A, 5G 7.5 Gbps DL

GPRS

Yes

EDGE

Yes

CAMERA

Rear Triple

64 MP, f/1.8, 26mm
(wide), 1/1.72″, 0.8µm, PDAF
8 MP, f/2.0, 13mm (ultrawide), 1.12µm
2 MP, (macro)

Features

LED flash, HDR,
panorama

Videos

8K@15fps,
4K@30/60fps, 1080p@30/60/120/240fps

Front

8 MP, f/2.0, (wide), 1.12µm
HDR
1080p@30fps

HARDWARE

OS

Android 11

Chipset

Qualcomm SM8250
Snapdragon 865 (7 nm+)

CPU

Octa-core (1×2.84
GHz Kryo 585 & 3×2.42 GHz Kryo 585 & 4×1.8 GHz Kryo 585)

GPU

AAdreno 650

RAM

8GB

Storage

128GB

Card Slot

No

BATTERY

Type

Li-Po

Capacity

4500mAh

Removable

Non-Removable

Talk Time

N/A

Stand By

N/A

Fast Charging

Fast charging 55W,
56% in 15 min, 100% in 40 min (advertised)

Wireless Charging

COMMONS

Sound

3.5mm Audio Jeck,
32-bit/384kHz audio

Sensors

Fingerprint (under
display, optical), accelerometer, gyro, proximity, compass

Bluetooth

5.1, A2DP, aptX, LE

GPS

Yes, with dual-band
A-GPS, GLONASS, BDS, GALILEO, QZSS

USB

3.0, Type-C 1.0
reversible connector, USB On-The-Go; accessory connector

Wi Fi

Wi-Fi 802.11
a/b/g/n/ac/6, dual-band, Wi-Fi Direct, hotspot

NFC

Yes 

Flash...   ఒక Account తో ఒకేసారి నాలుగు Devices లో వాట్సాప్ పని చేస్తుంది