Gas Booking: మిస్డ్ కాల్ తో గ్యాస్ సిలెండర్ ని ఇలా పొందండి..!

 మిస్డ్ కాల్ తో గ్యాస్ సిలెండర్ ని ఇలా పొందండి..!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎల్‌పీజీ. సిలిండర్ బుకింగ్‌ను మరింత సులభతరం చేసింది. కేవలం ఒకే ఒక్క మిస్డ్ కాల్ తో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని మీ ఇంటి వద్దకి పొందొచ్చు. దేశంలో ఏ ప్రాంతం నుంచైనా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోచ్చు. ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందని ఐఓసీ చెప్పింది.

చదవండి : LPG GAS సిలెండర్ వాడే వారికి అలర్ట్..!

ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. ఐఓసీ తన ఎల్‌పీజీ కస్టమర్లకు 8454955555 నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇచ్చి బుక్ చేసుకోవాలని అంది. దీని కోసం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. పైగా దీని కోసం కస్టమర్లు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన పని ఉండదు.

చదవండి : మీకు TDS కట్ అయినదీ లేనిదీ తెలుసుకోవడం ఎలా?

కేవలం ఇలానే కాకుండా ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కస్టమర్లు ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోచ్చు. హెచ్‌పీ కస్టమర్లు 9222201122 వాట్సాప్ చేసి బుక్ చెయ్యచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి బుక్ అని టైప్ చేసి, 9222201122కి వాట్సాప్ చేయాలి. అదే ఒకవేళ భారత్ గ్యాస్ కస్టమర్లు 1 లేదా బుక్ అనే మెసేజ్‌ను మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 1800224344కి పంపాలి. ఆ తరవాత కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది.

Flash...   పాఠాలు కావాలా .. ? ప్రాణాలు కావాలా .. ?