ఉద్యోగులకు Good News.. త్వరలో PF అమౌంట్‌ పెరిగే అవకాశం.. వేతన సరళిలో మార్పులు

 ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో పీఎఫ్ అమౌంట్‌ పెరిగే అవకాశం.. వేతన సరళిలో మార్పులు.

PF Amount: ఉద్యోగులకు ఈ విషయం శుభవార్తనే చెప్పాలి. త్వరలో పీఎఫ్ అమౌంట్‌ పెరగబోతుంది. ఎలా అంటే ప్రభుత్తం నాలుగు కొత్త లేబర్‌ కోడ్‌లని ప్రవేశపెడుతుంది. వీటి ప్రకారం ఉద్యోగుల జీతాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే పీఎఫ్ అమౌంట్‌ పెరిగినా టేక్ హోమ్ జీతాలు తగ్గుతాయి. కానీ ఇది మంచిదే. భవిష్యత్‌లో పీఎఫ్‌ ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు పొందుతారు. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులపై కొత్త లేబర్ కోడ్‌లను అమలు చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

 తెలుసుకోండి : మీ PF బాలన్స్  స్లిప్స్ ఈ కింది లింక్ లో తెలుసుకోండి

కొత్త లేబర్ కోడ్‌ల అమలు 2022 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి అవుతుందని సీనియర్ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం భారతదేశం అంతటా ఉద్యోగులకు వారంలో మూడు రోజుల సెలవులు, నాలుగు రోజులు పని చేసే అవకాశం ఉంటుంది. కేంద్రం ఇప్పటికే ఈ కోడ్‌ల కింద నిబంధనలను ఖరారు చేసింది ఇప్పుడు రాష్ట్రాలు తమ వంతుగా నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కొత్త లేబర్ కోడ్‌లను అంచనా వేసిన నిపుణులను ఉద్యోగుల టేక్ హోమ్ జీతం తగ్గుతుందన్నారు.

మొత్తం జీతంలో 50 శాతం కంటే ఎక్కువ అలవెన్సులు ఉండకూడదని ఈ లేబర్‌ కోడ్‌లు నిర్దేశిస్తున్నాయి. అంటే ప్రాథమిక వేతనం లేదా మూల వేతనం 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. సాధారణంగా, యజమానులు జీతంలో నాన్-అలవెన్స్ భాగాన్ని 50 శాతం కంటే తక్కువగా ఉంచుతారు ఫలితంగా ఉద్యోగులకు అధిక వేతనం లభిస్తుంది. అయితే మార్పులు తీసుకువచ్చిన తర్వా యజమానులు ఉద్యోగుల మూల వేతనాన్ని పెంచవలసి ఉంటుంది. గ్రాట్యుటీ చెల్లింపులు పెరగడం, ప్రావిడెంట్ ఫండ్‌కు ఉద్యోగుల సహకారం కారణంగా టేక్-హోమ్ జీతాలు తగ్గుతాయి.

Flash...   Feedback Google form for Complex level Teachers training