Heart Attack : ఈ పండు రోజూ తింటే హార్ట్‌ అటాక్‌ రాదంట..!

 Heart Attack and Banana : ఈ పండు రోజూ తింటే హార్ట్‌ అటాక్‌ రాదంట..! ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకుల వెల్లడి.

(Heart Attack and Banana) ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న జబ్బుల్లో హార్ట్ ఎటాక్ ఒకటి. హార్ట్ ఎటాక్ రావడం ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. కొన్నేండ్ల కింద వరకు కేవలం వృద్ధులు, ఊబకాయులకు గుండెపోటు వచ్చేది. అయితే, ఇప్పుడు మారిన జీవనశైలితో యువకుల్లో కూడా గుండెజబ్బులు కనిపిస్తున్నాయి. గుండె జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు నిత్యం ఒక అరటి పండు తినడం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. ప్రతి రోజు ఒక అరటి పండు తినేవారు గుండెపోటు బారి నుంచి తప్పించుకోవచ్చని వారు సెలవిస్తున్నారు.

చదవండి :స్నానం చివరలో ఇలా చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందట..

మిగతా పండ్లలో కంటె ఎక్కవ పోషకాలు అరటి పండులో లభిస్తాయి. అరటిపండ్లలో విటమిన్లు, ఐరన్, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైనవి ఉంటాయి. శక్తికి మంచి ప్రత్యామ్నాయంగా కూడా వైద్యులు సూచిస్తుంటారు. ప్రతిరోజు అరటిపండు తినడం అలవాటు చేసుకోవడం ద్వారా గుండెపోటుతో మరణించే ప్రమాదాన్ని మూడో వంతు తగ్గించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. దీనిలో ఉండే పొటాషియం ధమనులు మూసుకుపోకుండా చూస్తుంది. అయితే తాజా పండ్లను తినడం శ్రేయస్కరమని అధ్యయనకారులు సూచిస్తున్నారు. మహిళలకు పీరియడ్స్, గర్భం కారణంగా శరీరంలో ఐరన్, కాల్షియం వంటి లోపాలు లేకుండా అరటి పండు చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి : ప్రతి రోజూ ఉల్లిపాయ తింటే … పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి..!

అలబామా యూనివర్సిటీ పరిశోధన ప్రకారం, అరటిపండ్లు తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిత్యం మీడియం సైజ్ అరటి పండు ఒకటి తినడం వల్ల శరీరానికి 9 శాతం పొటాషియం అందుతుంది. అరటి పండు తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. హృదయనాళ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Flash...   SBI GOOD NEWS: సులభంగానే రూ.14 లక్షల రుణం.. అర్హతలు ఇవే!