IT RETURNS : గడువు పొడిగింపు పై కేంద్రం కీలక ప్రకటన

 ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు పై కేంద్రం కీలక ప్రకటన.

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం చేదువార్తను అందించింది. డిసెంబర్ 31తో ముగుస్తున్న ఐటీఆర్ దాఖలు గడువును పెంచేందుకు కేంద్రం నిరాకరించింది. ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును ఎట్టి పరిస్థితుల్లో పొడిగించే అవకాశం లేదని కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 5.62 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు.

READ: INCOMETAX గణన ,SOFTWARES ఇక్కడ చుడండి (KSS PRASAD IT SOFTWARE)

మరోవైపు శుక్రవారంతో ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు ముగియనుండటంతో డిసెంబర్ 30న గురువారం ఒక్కరోజే 24.39 లక్షల మంది ఐటీఆర్ దాఖలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఒక్క గంటలో 2.79 లక్షల మంది ఐటీఆర్ దాఖలు చేశారని తెలిపింది. కాగా ఈ ఏడాది కొత్తగా 60 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. చివరి రోజు కూడా భారీ సంఖ్యలో ఐటీ రిటర్న్స్ దాఖలవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకుంటే రూ.5 లక్షలకు పైగా ఆదాయం పొందే వారు రూ.5వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని అదనంగా లభించే బెనిఫిట్లను కూడా వదులుకోవాల్సి ఉంటుంది.

Flash...   Revised Schedule for Gr-II HMs and SA Tel, Hindi to exercise web options