Jagananna Housing Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. సంపూర్ణ గృహ హక్కు పథకంపై కీలక ఉత్తర్వులు..

Jagananna Housing Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. సంపూర్ణ గృహ హక్కు పథకంపై కీలక ఉత్తర్వులు..


ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.35వేల అదనపు రుణం తీసుకునేందుకు వీలు కల్పిస్తూ కీలక ఉత్తర్వులు వెలువరించింది. బ్యాంకుల నుంచి ఈ అదనపు రుణం పొందవచ్చని, దీనికి గాను బ్యాంకులు కేవలం 3 వడ్డీని మాత్రమే వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తం 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి గానూ ఈ రూ.35 వేల అదనపు రుణాన్ని తీసుకునేందుకు అనుమతిస్తూ గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

రేపే ప్రారంభం..

కాగా ఇళ్లు లేని పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించాలని, వారి ఇళ్లపై వారికి అధికారాలను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా జగనన్న ‘సంపూర్ణ గృహ హక్కు పథకం (వన్ టైం సెటిల్ మెంట్)’ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. రేపు (డిసెంబర్‌21) పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆయన ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఇటీవల ఈ పథకంపై కొన్ని అనుమానాలు, అపోహలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (వన్ టైం సెటిల్ మెంట్) పూర్తి స్వచ్ఛంమని.. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు అనేక ప్రయోజనాలు, లబ్ధి చేకూరుతుందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు.

Flash...   Formative Assessment 3 Syllabus FEB 2022