JAGANANNA SMART TOWNSHIP : సంక్రాంతి నాటికి లే అవుట్లు రెడీ, ఆన్‌లైన్ బుకింగ్‌

 ఏపీ ప్రజలకు తీపి కబురు.. సంక్రాంతి నాటికి లే అవుట్లు రెడీ, ఆన్‌లైన్ బుకింగ్‌

జగనన్న టౌన్‌షిప్ పనులు వేగవంతం

సంక్రాంతి నాటికి అందుబాటులోకి

ఆన్‌లైన్ ద్వారా బుకింగ్‌కు అవకాశం

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లే అవుట్ల పనులు మొదలయ్యాయి. అనంతపురం జిల్లాలోని ధర్మవరం, ప్రకాశం జిల్లాలోని కందుకూరు, కడప జిల్లాలోని రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలిలో లే అవుట్లను వేశారు. జనాల డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల్లో అన్ని వసతులతో ప్లాట్లను సిద్ధం చేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా అర్బన్‌ అథారిటీ పరిధిలో మరికొన్ని లే అవుట్లను సిద్ధం చేస్తున్నారు.

ఫ్లాట్స్ పొందడానికి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ను వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది

పూర్తి వివరాలు / ఆన్లైన్ బుకింగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ప్రభుత్వ ప్రధానంగా నగర, పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి ఆదాయ వర్గాల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఈ జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లే అవుట్లను ఏర్పాటు చేస్తోంది. మార్కెట్‌ ధర కంటే తక్కువకు ప్లాట్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలివిడతలో వీటన్నింటినీ సిద్ధం చేసి సంక్రాంతి నాటికి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. అంతకు ముందే ప్లాట్ల బుకింగ్‌కు అనుగుణంగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ను కూడా ప్రారంభించాలని భావిస్తున్నారు.

సాధ్యమైనంత వరకు ఈ లే అవుట్లను ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే ప్రభుత్వ పరిశ్రమలకు చెందిన భూములను తీసుకుని.. ఆ వ్యయాన్ని ఆయా పరిశ్రమలకు చెల్లించనున్నారు. అవసరమైన చోట ప్రైవేటు భూములను మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగం జీవో నంబర్‌ 76 నిబంధనలకు లోబడి తీసుకుంటోంది.

ప్రభుత్వం ఇలా సేకరించిన భూముల్లో భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా 50% భూమిని అన్ని రకాల మౌలిక వసతులకు కేటాయిస్తున్నారు. మిగిలిన స్థలంలో మాత్రమే ప్లాట్లు వేస్తున్నారు. ఈ ప్లాట్లు వేయడానికి అయిన ఖర్చు మేరకే ప్రజలకు అందించనున్నారు. ఈ లే అవుట్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందించేందుకు సిద్ధమవుతున్నారు.

Flash...   CBSE SCHOOLS: TWO DAYS RESIDENTIAL TRAINING ON CBSE SCHOOLS