JUST IN : PRC పై కీలక సమావేశం.. పీటముడి వీడేనా?

 పీఆర్సీపై కీలక సమావేశం.. పీటముడి వీడేనా?

ఏపీలో అధికారులు, ఉద్యోగుల మధ్య పీఆర్సీ పీటముడి వీడడం లేదు. కాసేపట్లో ప్రారంభం కానుంది పీఆర్సీ పై కీలక సమావేశం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు ప్రభుత్వ సలహాదారు సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు శశిభూషణ్, రావత్. అనంతరం సీఎంతో భేటీ కానుంది అధికారుల బృందం.

ఫ్లాష్.... ఈ రోజు ఫిట్మెంట్ ఖరారు 

ఐఆర్ 27 శాతం ఇస్తున్న నేపథ్యంలో దీని కంటే ఎక్కువ ఫిట్ మెంట్ ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అదనపు భారం సాధ్యం కాదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇప్పుడు వస్తున్న జీతాలను ప్రొటెక్ట్ చేస్తామని భరోసా ఇస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మ ఉద్యోగ సంఘాలతో భేటీ అయి ఏం తేలుస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Flash...   From the Desk of Principal Secretory: Episode 12 Praveen prakash live program