సమగ్ర శిక్షా ‘జగనన్న విద్యాకానుక’ విద్యార్థుల కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థులు పాదాల కొలతలను సేకరించి – నమోదు చేయుట కొరకు జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు ఆదేశాలు.
Rc.1602/50/2021/CMO SEC-SSA Dt:22.12.21
ఆదేశములు:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యాకానుక’ పథకం కింద స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పథకం మూడో ఏడాది అమలులో భాగంగా 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ‘జగనన్న విద్యాకానుక’ పేరుతో స్టూడెంట్ కిట్లు సరఫరా చేయడం జరుగుతుంది.
- 2.ఇందులో భాగంగా ఒక్కో విద్యార్థికి కిట్ లో 3 జతల యూనిఫాం క్లాత్, ఒక సెట్ నోటు
- 3. పుస్తకాలు, వర్క్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, డిక్షనరీతో పాటు బ్యాగు ఉంటాయి. ప్రతి విద్యార్థికి బూట్లు పంపిణీ చేసే ప్రక్రియలో భాగంగా బూట్లు సరైన సైజులో అందించేందుకు విద్యార్థుల నుంచి స్వయంగా పాద కొలతలు తీసుకోవడానికి ఈ కింది సూచనలు పొందుపరచడమైనది.
విద్యార్థుల పాద కొలతలు నమోదులో పాటించవలసిన సూచనలు
రాష్ట్రంలోని విద్యా, సంక్షేమ శాఖలకు చెందిన ప్రభుత్వ/ మండల పరిషత్/ జిల్లా
పరిషత్/ మున్సిపల్/ కేజీబీవీ/ మోడల్ స్కూల్స్/ ఆశ్రమ/ రెసిడెన్షియల్/ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిల పాదాల కొలతలు తీసుకోవాలి.
ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు/ తరగతి ఉపాధ్యాయులు / వ్యాయామ ఉపాధ్యాయులు /పార్ట్ టైమ్ ఇనస్ట్రక్టర్లు, స్థానిక సిబ్బంది బాధ్యత తీసుకోవాలి.
ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వివరాలు సేకరించవలసిన అవసరం లేదు.
విద్యార్థులు పాదాల కొలతలను ఆన్ లైన్ ద్వారా నమోదు చేసే బాధ్యత ప్రధానోపాధ్యాయులకు అప్పగించడమైనది. లాగిన్ వివరాల కోసం https://cse.ap.gov.in వెబ్ సైటులో సందర్శించాలి.
ముఖ్యంగా చేయవలసినవి:
విద్యార్థులు పాదాల కొలతలను తీసుకునేటప్పుడు ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవలసిన అంశం:
విద్యార్థుల పాదాల కొలతలను “సెంటీమీటర్ల”లో మాత్రమే తీసుకోవాలి.
విద్యార్థుల పాదాల కొలతలు తీసుకున్న తర్వాత వాటిని హెచ్ఎం లాగిన్లో నమోదు చేయవలసి ఉంటుంది.
విద్యార్థులు పాదాల కొలతలు తీసుకునేటప్పుడు కోవిడ్-19ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాలు తప్పకుండా ఆచరిస్తూ, భౌతికదూరం పాటించడం, శానిటైజర్,-హ్యాండ్ వాష్ వంటివి తప్పక వినియోగించి తగిన జాగ్రత్తలు వహించాలి.
శానిటైజర్ వంటి వాటికోసం పాఠశాల కాంపోజిట్ నిధులు వినియోగించుకోవాలి. నమోదు ఇలా విద్యార్థుల పాదాల కొలతలు తీసుకోవడానికి సాధారణ స్కేలుతో కొలవాలి.
విద్యార్థుల పాదాలని పై బొమ్మలో చూపించిన విధంగా స్కేల్ ఉపయోగించి కొలతలుతీసుకోవాలి.
పైన పేర్కొన్న విధంగా A నుండి B వరకు గల కొలతలని సెంటీ మీటర్లలో తీసుకోవాలి.
కొలతలు తీసుకున్న తర్వాత విద్యార్థుల పాదాల కొలతలన్నీ ఆన్ లైన్లో పొందుపరచడానికి హెచ్ఎం లాగిన్ ఓపెన్ చేయాలి.
హెచ్ఎంల లాగిన్ ఓపెన్ చేయగానే పాదాల కొలతలు నమోదు చేయడానికి పాఠశాల, విద్యార్థుల పేర్లు వంటి వివరాలతో ప్రత్యేక స్క్రీన్ కనిపిస్తుంది.
విద్యార్థుల వివరాల పక్కనే సైజ్ ఆప్షన్ బాక్సులో వారి పాదాల కొలతలునింపాలి.
సెంటీమీటర్లలో విద్యార్థుల పాదాల కొలతల వివరాలన్నీ హెచ్ఎం లాగిన్లో 07.01.2022వ తేదీ లోపు పొందుపరచాలి.
తమ పాఠశాలకు సంబంధించి ఎన్ని బూట్లు కావాలో హెచ్ఎం ధృవీకరించి మండల విద్యాశాఖాధికారి వారికి పంపాలి.
ఈ కార్యక్రమం పాఠశాలలో తరగతి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరగాలి.
స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో సీఆర్పీలు ఈ కార్యక్రమం కచ్చితంగా, సక్రమంగా జరిగేలా బాధ్యత వహించాలి.
మండల స్థాయిలో సంబంధిత మండల విద్యాశాఖాధికారి బాధ్యత వహించాలి. పాఠశాలల నుంచి సేకరించిన వివరాలను మండల స్థాయి ఇండెంట్ ను నివేదిక రూపంలో 11.01.2022 తేదీ లోపు సంబంధిత జిల్లా అధికారులకు మండల విద్యాశాఖాధికారి ధృవీకరించి పంపించాలి.
జిల్లాకు సరిపడినంత ఇండెంట్ (సైజులు వారీగా) సంఖ్యను జిల్లా విద్యాశాఖాధికారి/ సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ధృవీకరిస్తూ 13.01.2022 నాటికి రాష్ట్ర కార్యాలయానికి పంపాలి. రాష్ట్ర కార్యాలయానికి పంపవలసిన నివేదిక (Indent abstract model) నమూనా ఈ సర్క్యూలరుతో పాటు పొందుపరచడమైనది. జిల్లా స్థాయిలో డిప్యూటి జిల్లా విద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేలా బాధ్యత వహించాలి. హెచ్ఎం లాగిన్లో నమోదు చేసేటప్పుడు ఏవైనా సందేహాలు, సమస్యలు ఎదురైతే కార్యాలయపు పని వేళల్లో 6302832423, 70320 91512 నంబర్లకు సంప్రదించగలరు.
పైన తెలిపిన ఆదేశాలు అతి జరూరుగా భావించి నిర్దేశించిన సమయంలోపల పొందుపరచగలరు. లేనియెడల తగు చర్యలు తీసుకోబడును.
( దీనితో పాటు ఇండెంట్ నివేదిక (Indent abstract model) నమూనా జతపరచడమైనది)