Cameras in Cell phones: సెల్ ఫోన్ లో ఏకెమెరా ఎందుకు ఉపయోగపడుతుందో మీకు తెలుసా.

సెల్ ఫోన్ లో ఏకెమెరా ఎందుకు ఉపయోగపడుతుందో మీకు తెలుసా…

మనలో చాలా మందికి సెల్ ఫోన్ వెనకాల కెమెరాలు ఉంటాయి అని తెలుసు…. 

కానీ అవి ఏమిటి… ఎందుకోసం ఆ కెమెరాలు ఉన్నాయి… వాటిని ఏ ప్రయోజనంకోసం వాడాలి… ఎలా ఉపయోగించాలో తెలియదు… వారికోసమే ఈ పోస్ట్… 

గతంలో కేవలం ఒకే ఒక బ్యాక్ కెమెరా ఉండేది… 

తర్వాత ఫ్రంట్ కెమెరా వచ్చింది… 

ఆ తర్వాత ఎక్కువ మెగా పిక్సెల్స్ తో కెమెరాలు రావడం కూడా మొదలయ్యింది… 

రెండు కెమెరాలు వచ్చాయి… మూడు వచ్చాయి… ఇప్పుడు నాలుగు కూడా వచ్చేసాయి… అయితే ఇది ఎందుకు వీటితో మనం ఏం చేయవచ్చు అనేది చూద్దాం…

| 1 camera mobile |

 | 2 camera mobile | | Portrait Mode Camera | |3d photo |

 మామూలు బ్యాక్ కెమెరా తోటి ఎక్కువ మెగా పిక్సెల్స్ ఉన్నకారణంగా…మంచి ఫోటో తీయడానికి వీలవుతుంది… అయితే ఇది డెప్త్ పిక్సెల్స్ కు పనికిరాదు… అంటే పిక్చర్లో రెండు ఆబ్జెక్ట్ ల మధ్య లోతును సరిగా చూపించలేదు… అందుకే డ్యూయల్ కెమెరా లో Depth Option కొరకు ఒక portrait కెమెరాను ఉపయోగించారు… ఇది Depth Option ను బాగా కవర్ చేస్తుంది…ఇక్కడ object క్లియర్ గా ఉండి… మిగితాది అంతా blur గా కనపడుతుంది మీ దగ్గర back కెమెరాలో రెండు కెమెరాలు ఉంటే… ఈ portrait modeను ఉపయోగించవచ్చు… ఇలా Portraid Mode లో తీసిన ఫోటో… ఫేస్ బుక్ లో 3D photo లా మారుతుంది… అంత ఉందన్నమాట ఈ Portrait mode లో తీసిన ఫోటో ఈ కింది విధం గా ఉంటుంది . 


| 3 Camera Mobile | | light sensor mode Camera | 

ఇక కొత్తగా వచ్చిన ఆ మూడో కెమెరా లైట్ సెన్సార్ గురించి… ఒకే ఫోన్లో మూడు కెమెరాలు ఉండటం వలన చాలా తక్కువ లైటింగ్ తో కూడా ఫోటోలు చాలా క్లారిటీగా తీయగలము… ఈ కెమెరా లు వేర్వేరు aperture(కెమెరా కన్ను పరిమాణం) లలో ఉండడం వలన ఈ effect వస్తుంది…. ఫోటో స్టూడియో ఎఫెక్ట్ లైటింగ్ దీంట్లో సాధ్యమవుతుంది…. ఎక్స్ట్రా జూమ్ టెలిస్కోపిక్ లెన్స్ సాధ్యమవుతుంది…. మామూలు డ్యూయల్ కెమెరా లో 2x జూమ్ వస్తే దీంట్లో 5x జూమ్ వరకు రావచ్చు… కొన్ని ఫోన్లలో మూడో కెమెరా ను వైడ్ యాంగిల్ కెమెరా గా కూడా ఉపయోగిస్తారు.. 

Flash...   మంచినీళ్ల కోసం ఇళ్లల్లో బాటిల్స్‌ను వాడుతున్నారా..? అయితే ఈ 3 విషయాలు తెలుసుకోవాల్సిందే..!

| 4 camera mobile | | 5 x zoom camera mobile| | 10 x zoom camera Mobile|

| wide angle camera mobile | | Macro mode camera mobile | | fisheye camera mobile |

ఇక నాలుగో కెమెరా వస్తే అది macro mode … ఈ నాలుగో కెమెరా వేరువేరు మొబైల్స్ లో వేరువేరు విధాలుగా ఉపయోగించవచ్చు… అది వైడ్ యాంగిల్ కెమెరా గా కానీ… మాక్రో కెమెరా గా కానీ… Fish eye lense గా కానీ… Extra 10x zoom గా కానీ ఇవ్వవచ్చు… ఇదండీ కెమెరా ఫోన్ ల సంగతి… 

మన ఫోన్ లో ఎన్ని కెమెరాల అయినా ఉండనీయండి దానిని సరిగా వాడకపోతే ఏ ఉపయోగం లేదు… అందుకే ఎక్కువగా ఖర్చు చేయకుండా ఎంత వరకు అవసరమో దానికి తగిన ఫోన్ ను తీసుకోండి ఏ ఫోన్ అయినా సరే దాని విలువ 15,000 కు మించకుండా ఉంటే మంచిది.