LG సరికొత్త ఆవిష్కరణ.. stand by me TV. ఇక కరెంట్ లేకున్నా 3 గంటలు టీవీ చూడొచ్చు..!

 LG సరికొత్త ఆవిష్కరణ.. ఇక కరెంట్ లేకున్నా 3 గంటలు టీవీ చూడొచ్చు..!

అరె.. టీవీ అక్కడెక్కడో మూలన కాకుండా నా సోఫా పక్కనే ఉంటే బాగుండేది. ఎంచక్కా పడుకొని సినిమా చూసేవాడిని. అయ్యయ్యో.. వంట పూర్తయ్యేసరికి సీరియల్‌ కూడా అయిపోయేలా ఉందే. కిచెన్‌లోకే టీవీని లాక్కొచ్చుకుంటే బావుండు. అటు సీరియల్‌ చూస్తూ ఇటు వంట చేసుకునేదాన్ని.. అని ఇక అనుకోనక్కర్లేదు. ఎందుకంటే అచ్చం ఇలాంటి ఫీచర్లతోనే అద్భుతమైన టీవీని ఎల్‌జీ కంపెనీ తీసుకొస్తోంది. వచ్చే జనవరిలోనే లాంచ్‌ చేయబోతోంది. పేరు ‘ stand by me’.

టీవీ పరిమాణం 27 అంగుళాలు. రిమోట్, టచ్‌తో పాటు మన సంజ్ఞలతో కూడా ఆపరేట్‌ చేయొచ్చు. బ్యాటరీతో నడిచే టీవీ ఇది. అయితే ఓ సినిమా చూశాక మళ్లీ చార్జ్‌ చేయాల్సి ఉంటుంది. మున్ముందు బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుతారేమో చూడాలి. టీవీలానే కాకుండా మన మానసిక స్థితి(మూడ్‌)ని మార్చే వాల్‌పేపర్లు, ఫొటోలు, రంగులను కూడా టీవీలో సెట్‌ చేసుకోవచ్చు. టీవీకి పెద్దగా వైర్లు అవసరం ఉండదు. ఇంతకీ టీవీ ధరెంతో చెప్పలేదు కదా. ఎల్‌జీ వాళ్లు కూడా ఇంకా ప్రకటించ లేదు.

లాక్కెళ్లొచ్చు.. తిప్పుకోవచ్చు 

టీవీలకు ఎల్‌జీ పెట్టింది పేరు. మనం ఇంతవరకు చూడని రకరకాల ఫీచర్లతో, అనేక రకాల మోడళ్లతో మనల్ని ఆశ్చర్యపరిచింది. గ్లాస్‌లా పారదర్శకంగా ఉండే టీవీల దగ్గర్నుంచి 325 అంగుళాల అతి పెద్ద టీవీ వరకు చిత్ర విచిత్రమైనవి అందుబాటులోకి తెచ్చి ‘వారెవ్వా’ అనిపించుకుంది. ‘అప్పుడే అయిపోలేదు’.. అంటూ ఇప్పుడు ‘స్టాన్‌బై మీ’ టీవీని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. పేరుకు తగ్గట్టే ఇంట్లో మనం ఎక్కడుంటే అక్కడికి టీవీని తీసుకెళ్లొచ్చు. టీవీతో పాటు వచ్చే స్టాండ్‌ కింద ఇందుకోసం చక్రాలుంటాయి. డ్రైవర్‌ స్టీరింగ్‌ను తిప్పినట్టు ఎలా కావాలంటే అలా టీవీని తిప్పుకోవచ్చు. మనకు నచ్చిన ఎత్తులో, నచ్చిన యాంగిల్‌లో సినిమాలు, సీరియళ్లు, ప్రోగ్రామ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు రకరకరాల పనులు చేసుకోవచ్చు. 

VISIT OFFICIAL SITE 

Flash...   SBl RECRUITMENT OF SPECIALIST CADRE OFFICERS ON REGULAR BASIS