ప్రతీ నెలా ఆదాయం పొందాలంటే ఈ పధకంలో చేరచ్చు..!
ఈ స్కీమ్ తో ప్రతీ నెలా డబ్బులు పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పోస్ట్ ఆఫీస్ మంథ్లీ ఇన్‌కమ్ స్కీమ్ లో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టి, స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. మీరు ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టాలంటే మీ సమీపంలోని పోస్టాఫీసులో ఈ స్కీమ్ ని ఓపెన్ చేయచ్చు. అలా పెట్టుబడి పెట్టచ్చు.
ఈ పథకంలో రూ.1,000 కంటే తక్కువ మొత్తంతో పెట్టుబడులు కూడా పెట్టచ్చు. గ్యారెంటీ రిటర్న్‌లతో పాటు, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C నిబంధనల ప్రకారం పన్ను ప్రయోజనాలను కూడా పొందడానికి అవుతుంది. ఇది ఇలా ఉంటే పోస్టాఫీస్ మంథ్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో వస్తుంది. ఈ స్కీమ్ లో వ్యక్తిగతంగా రూ. 4.5 లక్షల వరకు లేదా సంయుక్తంగా రూ. 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టడానికి అవుతుంది.
వడ్డీ రేట్లు స్థిరంగా వుండవు. మారుతూ ఉంటాయి. నేరుగా పోస్టాఫీసు నుంచి వడ్డీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా వారి సేవింగ్స్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మైనర్ల కోసం కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోచ్చు.
కానీ 18 ఏళ్లు నిండిన తర్వాతే ప్రయోజనాలు పొందొచ్చు. ఒక ఇన్వెస్టర్ మొదటి సంవత్సరం పూర్తి కాకముందే తమ పెట్టుబడిని వెనక్కు తీసుకుంటే.. వారు ఎలాంటి ప్రయోజనాలని పొందలేరు. ఒకటి నుంచి మూడు సంవత్సరాల మధ్య చేసిన ఏదైనా ప్రీమెచూర్ విత్‌డ్రాలపై 2 శాతం పెనాల్టీ వర్తిస్తుంది.