NEW YEAR CELEBRATIONS: న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు…. ఒమిక్రాన్ ఎఫెక్ట్.

 న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు…. ఒమిక్రాన్ ఎఫెక్ట్.

దేశంలో కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. క్లబ్స్, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లలో 50% కెపాసిటీతోనే సెలబ్రేషన్స్ జరుపుకోవాలని, డీజేకు అనుమతి లేదని స్పష్టం చేసింది. టీకా తీసుకోని వారికి వేడుకల్లో పాల్గొనేందుకు పర్మిషన్ ఉండదని తెలిపింది. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2, 2022 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది.

Read Alsoఈ విధం గా ప్రమోషన్స్  లో టీచర్ ల సీనియారిటీ లెక్కించాలి

కర్ణాటకలో ఇప్పటివరకు 19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన బొమ్మై సర్కారు.. తగుచర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక వచ్చిన వారికి ముమ్మరంగా పరీక్షలు నిర్వహిస్తోంది. మరోవైపు దేశంలో ఇప్పటికే 200 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఇప్పటికే ఓమిక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది.

Flash...   Israel – India: ఇజ్రాయెల్ నుంచి 500కు పైగా ఐటీ సంస్థల చూపు భారత్ వైపు.!