Omicron 38 దేశాల్లో వ్యాప్తి చెందినా ఒక్కరూ మృతి చెందలేదు…డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడి

 Omicron 38 దేశాల్లో వ్యాప్తి చెందినా ఒక్కరూ మృతి చెందలేదు…డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడి.

జెనీవా: ఒమైక్రాన్ కొత్త కొవిడ్ వేరియంట్ 38 దేశాల్లో వ్యాప్తిచెందినా, దీనివల్ల ఒక్కరూ కూడా మరణించినట్లు నివేదికలు రాలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) శనివారం వెల్లడించింది.ఈ కొత్త వేరియెంట్ ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను దెబ్బతీస్తుందనే హెచ్చరికలతో దీని వ్యాప్తిని నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యశాఖ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. దక్షిణాఫ్రికా దేశంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య మూడు మిలియన్లు దాటింది. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ ఈ వేరియంట్ సంక్రమించింది.ఈ కొత్త వేరియెంట్ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందా? దీనికి చికిత్స, టీకాలు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయో తెలుసుకునేందుకు కొన్ని వారాలు పట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Also Read: ఓమైక్రాన్ అనే మ్యుటేషన్ తీవ్రమైనదా?

కొత్త వేరియంట్ వ్యాప్తి రాబోయే కొద్ది నెలల్లో యూరప్‌లోని సగానికి పైగా కొవిడ్ కేసులకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేశారని  డబ్ల్యూహెచ్‌వో అత్యవసర డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ చెప్పారు.డెల్టా స్ట్రెయిన్ మాదిరిగానే కొత్త వేరియంట్ కూడా ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను మందగించగలదని అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్ క్రిస్టాలినా జార్జివా శుక్రవారం తెలిపారు.డెల్టా లేదా బీటా కరోనా జాతులతో పోలిస్తే ఇది రీఇన్‌ఫెక్షన్‌లకు కారణమయ్యే అవకాశం మూడు రెట్లు ఎక్కువ అని సూచిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 

చదవండి : ఆ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి కరోనా తొందరగా సోకుతుందట..

Flash...   GSWS Village Ward Secretaries HDFC BANK SALARY Account - Free Insurance Offer