OMICRON మూలాల్లో HIV.. సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన సైంటిస్టులు

 ఒమిక్రాన్ మూలాల్లో హెచ్‌ఐవీ.. సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన సైంటిస్టులు.

ప్రపంచమంతా ఇప్పుడు ఒకే పేరు వినిపిపోస్తోంది.ఒక రకంగా చెప్పాలంటే ఆ పేరు వింటేనే దేశాలు హడలిపోతున్నాయి. అనుహ్యంగా, వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాలను హైరానాకు గురిచేస్తోంది.ఎంతలా అంటే కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారినీ ఇన్‌ఫెక్షన్ బారిన పడేలా వ్యాప్తి చెందుతోంది.

చదవండి : ఒమిక్రాన్ లాక్‌డౌన్‌లోకి వెళ్తున్నాం

ఉన్నపళంగా కరోనా ఇలా రూపాంతరం చెందటంపై ప్రపంచ శాస్ర్తవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. వారి పరిశోధనల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చాయి.ఒమిక్రాన్ మూలాల్లో హెచ్ ఐవీ వైరస్ ఉందని దక్షిణాఫ్రికా శాస్ర్తవేత్తలు ప్రాథమికంగా నిర్ధారించారు.

చదవండి : AP ప్రజలకు BIG ALERT: ఇకపై కఠిన ఆంక్షలు

గతేడాది ఓ నివేదికను విడుదల చేసింది ‘యూఎన్ ఎయిడ్స్’.ఈ నివేదికలో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి.ప్రపంచంలో దక్షిణాఫ్రికా దేశం హెచ్‌ఐవీ కేంద్రంగా మారిందని.18-45 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్ఐవీ బారిన పడ్డారని నివేదికలో పేర్కొంది.ఈ వైరస్ పట్ల అక్కడి వారికి అసలు అవగాహన లేదని.వైరస్ సోకిన వారిలో 30 శాతంపైగా బాధితులు యాంటీరిట్రో వైరల్ డ్రగ్స్ తీసుకోవడం లేదని నివేదికలో స్పష్టం చేసింది.

చదవండిఈ రోజు మీ పాఠశాల అటెండన్స్ రిపోర్టు చూడండి 

హెచ్‌ఐవీ సోకి.మందులు వాడని వారిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుందని అలాంటి వారికి ఇతర వ్యాధులు వ్యాపించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్ర్తవేత్తలు తెలిపారు.ఇలా హెచ్ఐవీ సోకి, బలహీన పడ్డ మహిళ‌కు కరోనా సోకిందని ఆమె శరీరంలో కరోనా వైరస్ పరివర్తనం చెంది ఒమిక్రాన్ గా రూపాంతరం చెంది ఉంటుందని శాస్ర్తవేత్తలు ఓ అంచనాకు వచ్చారు.కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన డాక్టర్ కెంప్‌ టీం కూడా సరిగ్గా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది.

చదవండికొత్త DA  తో మీ పెరిగిన జీతం ఎంతో తెలుసుకోండి 

HIV వైరస్‌ బారిన పడిన వారిలో కరోనా విజృంభించడానికి అనువైన పరిస్థితులుంటాయని… దక్షిణాఫ్రికాలో హెచ్‌ఐవీ బాధితులు అధిక సంఖ్యలో ఉండటంతో అక్కడే ఒమిక్రాన్‌గా అవతరించి ఉండవచ్చని డాక్టర్ కెంప్ అభిప్రాయపడ్డారు.

Flash...   Income Tax: ఆదాయ పన్నుకు గుడ్‌బై చెప్పేసే సమయం వచ్చేసింది...