PRC ఇంతే ఇస్తాం.. ఇదే ఫిక్స్.. ఇక మీ ఇష్టం..!
➤ 14.29 శాతమే ఫిక్స్.. ఇక మీ ఇష్టం
➤ ఆపై ఇవ్వడం మాకు కష్టం
➤ ఉద్యోగులు ఒప్పుకోవాల్సిందే
➤ పీఆర్సీపై ప్రభుత్వం అల్టిమేటం?
➤ ఇది చెప్పడానికే నేడు జేఎస్‌సీ భేటీ
➤ వస్తే అన్నీ విడమరిచి చెబుతాం
➤ వేతనస్కేళ్లపై పూర్తి క్లారిటీ ఇస్తాం
➤ ఉద్యోగ సంఘాలకు ఆహ్వానాలు!
రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని ఫిక్స్ చేసిందంటూ వస్తున్న వార్తలు ఉద్యోగుల్లో ఆనందం నింపాలి. కానీ, అనుమానాలు రేపుతున్నాయి. అంతకుమించి ఆందోళన పెంచుతున్నాయి. అందుతున్న వేతనాలు కోసేసి.. పెండింగ్ డీఏలూ కలిపేసి సర్కారు దొంగదెబ్బ తీస్తుందనే భయాలే దీనికి కారణం!
చదవండి : NEW PRC లో మీ బేసిక్ పే ఎంతో ఇక్కడ తెలుసుకోండి
(అమరావతి-ఆంధ్రజ్యోతి) : ఉద్యోగులకు ప్రభుత్వం 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను దాదాపు ఫిక్స్ చేసేసింది. ఇంతకుమించి ఉద్యోగులకు ఒక్క శాతం కూడా అదనంగా ఇవ్వలేమని ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘాల నాయకులకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉద్యోగుల వేతన స్కేళ్లు ఎలా మారుతాయో ఉద్యోగ సంఘాల నేతలకు విడమరిచేసేందుకే ప్రభుత్వం బుధవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తోంది. ఫిట్‌మెంట్ 14.29 శాతం ప్రకారమైతే ఉద్యోగుల వేతనాలు ఇప్పుడు అందుకుంటున్న వాటి కంటే తగ్గుతాయి. వీటిని డీఏతో భర్తీ చేస్తామని ప్రభుత్వం నిర్మొహమాటంగా ఉద్యోగ సంఘాల నేతలకు చెబుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం నాటి సమావేశంలో కేవలం ప్రభుత్వం చెప్పేవి విని ఒప్పుకోవడమా లేదా ఉద్యోగల సంఘాల నాయకులకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన 14.29 శాతం ఫిట్‌మెంట్‌కే ఉద్యోగసంఘాల నాయకులు ఒప్పుకోవాల్సివస్తే ఉద్యోగులకు నచ్చజెప్పడం అసాధ్యమని భావిస్తున్నారు. ఒప్పుకోకపోతే ప్రభుత్వంతో తంటా.. ఒప్పుకొంటే ఉద్యోగులతో తంటా అన్నట్టు తయారైంది ఉద్యోగసంఘాల నాయకుల పరిస్థితి. వైసీపీ ప్రభుత్వానిది కక్షసాధింపు ధోరణి కాబట్టి ఒప్పుకోకపోతే పరిణామాలు ఎలా ఉంటాయా అన్నదానిపై ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వం తరపున సెక్రటరీలు ఫిట్‌మెంట్, పీఆర్సీ, ఐఆర్, డీఏ, వేతనస్కేళ్లు అంటూ రకరకాల లెక్కలు చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులను అయోమయంలోకి నెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.
చదవండి : D A arrears (3 Installments) వర్క్ షీట్ మీ పేరు తో డౌన్లోడ్ చేసుకోవచ్చు
➤ హెచ్‌ఆర్‌ఏ ఊసెత్తని ప్రభుత్వం
సీఎస్ కమిటీ నిర్ణయించిన 14.29% ఫిట్‌మెంట్ చుట్టూనే ప్రభుత్వం తిరుగుతూ ఉద్యోగ సంఘాల నా యకులను కూడా అదే పరిధిలో ఉంచుతోంది. సీఎస్ కమిటీ తన నివేదికలో హెచ్‌ఆర్‌ఏను కూడా భారీగా తగ్గించింది. 30%, 20% హెచ్‌ఆర్‌ఏ తీసుకుంటున్న వారందరినీ 16% హెచ్‌ఆర్‌ఏ పరిధిలోకి తెచ్చారు. దీనివల్ల కూడా ఉద్యోగులు తమ మూలవేతనంలో ఎక్కువగా నష్టపోతారు. దీనిపై ప్రభుత్వం వ్యూహత్మకంగానే మౌనంగా ఉంటోంది. కానీ, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా అదే మౌనం ఎందుకు వహిస్తున్నారనేది అర్థం కావడం లేదు.
➤ ఇవ్వని డీఏ ఎరియర్‌కు ట్యాక్స్
జగన్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు రెండు డీఏలు ఆమోదిస్తూ జీవోలైతే ఇచ్చారుగానీ వాటికి సం బంధించి ఉద్యోగులకు వేతనంతో కలిపి ఇవ్వాల్సిన ఆ డీఏల ఎరియర్స్ రూ.6,000 కోట్లు(60 నెలల బకాయి) ఇవ్వలేదు. ఈ రెండు డీఏల్లో ఉద్యోగులకు ఒక డీఏ ఎరియర్ ఇచ్చినట్టు ప్రభుత్వం చూపడంతో ఉద్యోగుల జీతంలో నుంచి ఇన్‌కమ్‌ట్యాక్స్ కట్ అయింది. జీతాల ను తగ్గించి, వాటిని డీఏలతో భర్తీ చేయాలన్న ప్రభు త్వ ఆలోచన ధోరణి చూస్తుంటే ఇకపై ఉద్యోగులకు డీఏలు ఇవ్వక్కర్లేదని ప్రభుత్వం భావిస్తోందని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
చదవండి : పెరిగిన NEW DA తో మీ జీతం ఎంత పెరిగిందో ఇక్కడ తెలుసుకోండి
➤ నేడు మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మరోమారు చర్చలు జరపనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ నేతృత్వంలో సచివాలయంలో బుధవారం జాయింట్ స్టాఫ్‌కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉద్యోగ జేఏసీలు, ఉద్యోగ సంఘాలకు సాధారణ పరిపాలనశాఖ ఆహ్వానాలు పంపింది. ఇలాంటి సమావేశం కోసం పిలుపు వచ్చినప్పుడల్లా పీఆర్సీతో పాటు సీపీఎ్‌సరద్దు, డీఏలు, కాం ట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపువంటి అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం 13 లక్షల మంది ఉద్యోగులు ఆశ గా ఎదురు చూడటం పరిపాటిగా మారింది. ప్రభు త్వం ఇప్పటికే పీఆర్సీపై చర్చలు, సమావేశాలు చాలా నే నిర్వహించింది. ఇప్పటి వరకు జరిగిన ఏ ఒక్క సమావేశంలోనూ ఈ సమస్యను కొలిక్కి తీసుకురాలేకపోయింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల పేరు తో గంటలతరబడి సమావేశాలు జరపడం… ఏవిధమైన స్పష్టత, హామీ ఇవ్వకుండానే మరోమారు చర్చించుకుందాం అంటూ సమావేశాలు వాయిదా వేయడం పరిపాటిగా మారిందని విమర్శిస్తున్నారు.
చదవండి : న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు….
చర్చలు అంటే ఇరు వర్గాల నుంచి ప్రతిపాదనలు, ఆలోచనలు, అభిప్రాయాలు, నిర్ణయాలు ఉండాలనీ, కానీ చర్చల్లో అధికారుల నోటి నుంచి ఒక్క సమస్యపైనా స్పష్టమైన హామీ లభించడంలేదని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పీఆర్సీపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు మంగళవారం అమరావతి సచివాలయం లో సీఎస్ సమీర్ శర్మతో 71డిమాండ్లపైన, సర్వీసెస్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌తో పీఆర్సీపైన చర్చించారు. అనంతరం బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు.
డీఏ ప్రకటనతో అనుమానాలు – బొప్పరాజు
ప్రభుత్వం ఒక డీఏ ప్రకటించడంతో పీఆర్సీపై అనుమానాలు అలుముకుంటున్నాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అపోహలకు తావులేకుండా ముఖ్యమంత్రి వద్ద చర్చలకు పిలవాల ని కోరారు. ‘‘జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో 71డిమాండ్లపై చర్చించాలని సీఎ్‌సను కోరాం. పెండింగ్‌లో ఉంచిన 3 డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులకు బకాయిపడ్డ రూ.1,600కోట్లు విడుదలకు చర్య లు తీసుకోవాలని అడిగాం’’ అని తెలిపారు. బుధవారం జరిగే చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉద్యమానికి తాత్కాలిక విరామం మాత్రమే ప్రకటించామని బొప్పరాజు తెలిపారు.