PRC LATEST UPDATE: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం: బండి శ్రీనివాసరావు.

 ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యోగులు రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో ఉద్యమంపై ఎపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడి కీలక కామెంట్స్!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఊహించని షాకిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమయ్యారు. జగన్ సర్కారుకు, ఉద్యోగుల మధ్య పీఆర్సీ, ఇతర బకాయిల పంచాయితీ తేలకపోవడంతో పోరుబాట పట్టారు. అయితే, ఈ విషయంలో ఉద్యోగ సంఘాల మధ్య చీలిక వచ్చేసింది. ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఓ వర్గం.. వ్యతిరేకంగా మరోవర్గం రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల హక్కుల విషయంలో మొదటి నుంచి గట్టిగా మాట్లాడుతున్న ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆదివారం కీలక కామెంట్స్ చేశారు.

చదవండి : పీఆర్సీ 2018 లో మీ బేసిక్ ఎంతో తెలుసుకోండి 

ఈ నెల 7 నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టినట్లు బండి శ్రీనివాసరావు వెల్లడించారు. 71 డిమాండ్లు సాధించే వరకు తమ ఉద్యమం సాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ నెల గడిస్తే మరో డీఏ వస్తుందని, ఇప్పటి వరకు మొత్తం 8 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని శ్రీనివాసరావు వివరించారు.

చదవండి : PRC పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవు.. వెంకట్రామిరెడ్డి

తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే, జేఏసీ నాయకులకు ఆందోళన ఎందుకని మరికొన్ని ఉద్యోగ సంఘాలు ట్విస్ట్ ఇచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సానుకూలంగా ఉన్నారని ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి చెప్పారు. సీఎం మాట ఇచ్చిన తర్వాత కూడా ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు.

చదవండి : గ్రామ సచివాలయాల్లో ATM లు.. CM JAGAN

సాధారణంగా ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను సరిగ్గా పట్టించుకోవని.. కానీ, జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆర్టీసీని విలీనం చేశారని వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. దీన్ని ఏ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమైనా ఊహించిందా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగ సమస్యలపై నీచ రాజకీయాలు సరికాదని.. వచ్చే వారం చివరికల్లా పీఆర్సీ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఎస్‌ రద్దు అంశంపై కూడా ముఖ్యమంత్రితో మాట్లాడామని చెప్పారు. బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని బ్లాక్‌ మెయిల్‌ చేసే విధంగా మాట్లాడుతున్నారని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు

Flash...   Cheque Bounce: చెక్ బౌన్స్ అయితే ఎలాంటి శిక్ష ఉంటుందో తెలుసా ? రూల్స్ ఏంటో తెలుసా?