PRC NEWS: జగన్‌తో ముగిసిన సజ్జల, బుగ్గన భేటీ

 జగన్‌తో ముగిసిన సజ్జల, బుగ్గన భేటీ

అమరావతి: సీఎం జగన్‌తో ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భేటీ ముగిసింది. ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలను సజ్జల, బుగ్గన సీఎంకు వివరించారు. ప్రస్తుతం ఉద్యోగులకు 27శాతం ఐఆర్ ఇస్తున్నామని, ఉద్యోగుల గ్రాస్ వేతనం తగ్గకుండా చర్యలు తీసుకుంటామని సజ్జల చెప్పారు. 

READ: KNOW YOUR PRC 2018  BASIC 

ఈ రోజు సీఎంతో ఉద్యోగ సంఘాల సమావేశం ఉండదని తెలిపారు. రేపటికి పీఆర్సీపై చర్చల ప్రక్రియ పూర్తికావచ్చని, ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిశాకే పీఆర్సీపై ప్రకటన ఉంటుందని సజ్జల తెలిపారు. ఈ రోజు సాయంత్రం మరోసారి సీఎస్‌, బుగ్గనతో ఉద్యోగ సంఘాల భేటీ కానున్నాయి

Flash...   మంచినీళ్ల కోసం ఇళ్లల్లో బాటిల్స్‌ను వాడుతున్నారా..? అయితే ఈ 3 విషయాలు తెలుసుకోవాల్సిందే..!