PRC ప్రాసెస్‌లో ఉంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు..!

 పీఆర్సీ ప్రాసెస్‌లో ఉంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు..!

పీఆర్సీ ప్రకటనపై ఓవైపు ఉద్యోగులు ఎదురుచూస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ కసరత్తు కొనసాగుతూనే ఉంది.. ఇవాళ పీఆర్సీ పై మూడు గంటలకు పైగా సమావేశం జరిగింది.. సీఎం జగన్ నేతృత్వంలో ఆర్ధిక శాఖ అధికారుల సమావేశం నిర్వహించారు.. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు తదితరులు హాజరయ్యారు.. ఇక, సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఆర్ధిక శాఖకు సంబంధించిన సమావేశంలో పీఆర్సీపై చర్చ జరిగిందని తెలిపారు.. పీఆర్సీ అంశం ప్రాసెస్‌లో ఉందన్న ఆయన.. పీఆర్సీ ఎంత శాతం ఇస్తారు అనే దానితో పాటు ఇతర అంశాలు చాలా ఉన్నాయన్నారు. ఉన్నంతలో ఎంతో కొంత అధికంగా ఇవ్వాలనే ఆలోచనలో సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నారని.. కాకపోతే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాలేదు.. ఇది వాస్తవం అని స్పష్టం చేశారు సజ్జల.

అయితే, రాజకీయ ప్రయోజనాల మాత్రమే చూస్తే వెంటనే పీఆర్సీ పై నిర్ణయం తీసుకోవచ్చు అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి… పీఆర్సీతో పాటు డీఏలు కూడా పెండింగ్ లో ఉన్నాయని గుర్తుచేసిన ఆయన.. అన్ని అంశాలు చూడాల్సి ఉందన్నారు.. మొత్తం బరువు మీద పడకుండా చూసుకోవాలని.. ఆర్ధిక పరిస్థితి బాలన్స్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. కానీ, కావాలని పీఆర్సీ ఆలస్యం చేయడం లేదని.. ఆర్ధికశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారని.. రేపటి నుంచి అధికారులు ఉద్యోగ సంఘాలతో మరో దఫా చర్చలు జరుపుతారని ప్రకటించారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Flash...   రిలయన్స్ నుంచి సరికొత్త ఎయిర్ ఫైబర్.. ఏకంగా 1.5 జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్..