SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక.
SBI Recruitment 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి.
* వీటిలో అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్) 04, డిప్యూటీ మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్) 07, మేనేజర్ (ఎస్‌ఎంఈ ప్రొడక్ట్స్) 06, చీఫ్ మేనేజర్ (కంపెనీ సెక్రటరీ) 02, ఇంటర్నల్ అంబుడ్స్‌మెన్ 02 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రాడ్యుయేసన్, సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీఏ/ పీజీడీఎం, ఐసీఎస్‌ఐలో కంపెనీ సెక్రటరీ మెంబర్, సీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 13-01-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..