TTD వెబ్‌ సైట్‌, అమెజాన్‌లో 2022 డైరీలు, క్యాలెండర్ల బుకింగ్‌

 టీటీడీ వెబ్‌ సైట్‌, అమెజాన్‌లో 2022 డైరీలు, క్యాలెండర్ల బుకింగ్‌.

తిరుమల, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): 2022వ సంవత్సరం క్యాలెండర్లను, డైరీలను టీటీడీ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌ ఆన్‌లైన్‌ సర్వీసె్‌సలోనూ బుక్‌ చేసుకునేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. టీటీడీకి చెందిన ‘https://tirupatibalaji.ap.gov.in/’ వెబ్‌సైట్‌లో ‘పబ్లికేషన్స్‌’ను క్లిక్‌ చేసి డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా ఆర్డరు చేయవచ్చు. టీటీడీ క్యాలెండర్లను, డైరీలను పోస్టు ద్వారా కూడా భక్తులు పొందవచ్చు. 

దీని కోసం భక్తులు ‘కార్యనిర్వహణాధికారి, టీటీడీ, తిరుపతి’ పేరుతో ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి ‘ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కేటీ రోడ్డు, తిరుపతి’ అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది.  0877 2264209 లేదా 99639 55585 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు. విజయవాడ, విశాఖ, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ, ముఖ్యమైన టీటీడీ కల్యాణ మండపాలు, టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ లభిస్తాయి.

Flash...   Guidelines for Distribution of Vidya kanuka kits to MEOs/CMOs