WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్లు.. WEB లో రియాక్షన్స్.. APP లో బబుల్స్‌

 WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్లు.. వెబ్‌లో రియాక్షన్స్.. యాప్‌లో బబుల్స్‌…

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌ కొత్తగా మరో రెండు ఫీచర్లను యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానుంది. మ్యూట్‌ నోటిఫికేషన్‌ ఫర్‌ మెసేజ్‌ రియాక్షన్‌, వాయిస్‌ వేవ్‌ఫార్మ్స్‌ పేరుతో వీటిని యూజర్స్‌కు పరిచయం చేయనుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్స్‌ను త్వరలోనే యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. వీటిలో వాయిస్‌ వేవ్‌ ఫార్మ్స్‌ ఫీచర్‌ ఇప్పటికే పలువురు ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ బీటా యూజర్స్‌ ఖాతాల్లో అప్‌డేట్‌ అయినట్లు సమాచారం. ఇక మ్యూట్ నోటిఫికేషన్‌ ఫర్‌ మెసేజ్‌ రియాక్షన్ ఫీచర్‌ను 2.2147.11. వెర్షన్‌ ద్వారా బీటా యూజర్స్‌కు పరీక్షించవచ్చని వాబీటాఇన్ఫో తెలిపింది. మరి ఈ ఫీచర్స్‌ ఎలా పనిచేస్తాయో చూద్దాం. 

అలెర్ట్ : మీ ఫోన్లో ఈ APP లు ఉంటే.. బ్యాంకు ఖాతాలో సొమ్ము ఖాళీ.. జాగ్రత్త

మ్యూట్ నోటిఫికేషన్‌ ఫర్ మెసేజ్ రియాక్షన్‌ ఫీచర్‌ను ముందుగా వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ యూజర్స్‌కు అందుబాటులోకి రానుంది. వాట్సాప్ డెస్క్‌టాప్‌లో కాంటాక్ట్‌ లిస్ట్‌ పైభాగంలో కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో నోటిఫికేషన్స్‌పై క్లిక్ చేస్తే మీకు సౌండ్స్‌, డెస్క్‌టాప్ అలర్ట్స్‌, షో ప్రివ్యూస్‌ టర్న్‌ ఆఫ్‌ డెస్క్‌టాప్ నోటిఫికేషన్స్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. వీటితోపాటు త్వరలో రాబోతున్న అప్‌డేట్‌లో టర్న్‌ ఆఫ్‌ ఆల్‌ రియాక్షన్స్‌ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్‌ కూడా కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే మీకు డెస్క్‌టాప్‌లో గ్రూప్‌ లేదా వ్యక్తిగత చాట్‌ల నుంచి వచ్చే మెసేజ్ నోటిఫికేషన్‌ రియాక్షన్స్‌ మాత్రం ఆగిపోతాయి.

WhatsApp Stickers: వాట్సాప్ స్టిక్కర్స్.. సేవ్‌ చేయకుండానే పంపేయండిలా!

 

ఇక మీదట యూజర్స్‌ వాట్సాప్‌ ద్వారా వాయిస్‌ మెసేజ్ పంపినప్పుడు వాయిస్‌ వేవ్‌ ఫార్మ్‌ ఫీచర్‌లో చాట్ బబుల్స్‌ కూడా కనిపిస్తాయి. దీని వల్ల యూజర్స్‌ వాయిస్‌ మెసేజ్‌లు వినేప్పుడు కొత్త అనుభూతిని పొందుతారని వాబీటాఇన్ఫో తెలిపింది. ఇప్పటికే ఈ ఫీచర్ పలువురు ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా యూజర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే పూర్తిస్థాయి యూజర్స్‌కు పరియం చేయనున్నట్లు సమాచారం. 

Flash...   Instagram new feature: ఇన్‌స్టాగ్రామ్‌ నయా ఫీచర్‌తో.. మార్కెటింగ్‌ ఈజీ!