WhatsApp: హలో మమ్మీ, డాడీ అంటూ తల్లిదండ్రుల వాట్సాప్​కు మెసేజ్​లు

 WhatsApp: హలో మమ్మీ, డాడీ అంటూ తల్లిదండ్రుల వాట్సాప్​కు మెసేజ్​లు.. ఆ తర్వాత రూ.లక్షలు స్వాహా

WhatsApp: ఈ రోజుల్లో ఎవర్ని నమ్మకూడదు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాల్ని దృష్టిలో పెట్టుకుని మెలగాలి. లేకపోతే అసలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.

మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీలోనూ విప్లమాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదే టెక్నాలజీ ఇప్పుడు సైబర్​ నేరగాళ్లకు వరంగా మారింది. కంటికి కనిపించకుండానే ఆన్​లైన్​ ద్వారా ఖాతాల్లో డబ్బు కాజేస్తున్నారు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో ప్రజలను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా వాట్సాప్ అకౌంట్‌​కు ఫేక్​ లింకులు పంపించి డబ్బులు కాజేసిన ఉదంతం యూకేలో వెలుగులోకి వచ్చింది.

చదవండి రూ.10 వేలకే.. అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే

కొంతమంది వాట్సాప్​ నంబర్లకు హాయ్​ మమ్మీ! హాయ్​ డాడీ అంటూ సైబర్​ నేరగాళ్లు మెసేజ్​లు పంపిస్తున్నారు. తల్లిదండ్రులు ఆ మెసేజ్​లు చూసి తమ పిల్లలే మెసేజ్​ పెట్టారనుకొని వారితో చాటింగ్​ చేస్తున్నారు. మోసగాళ్లు సైతం పేరెంట్స్‌కు ఎలాంటి అనుమానం రాకుండా అచ్చం వారి పిల్లల్లాగా చాట్ చేస్తున్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, ప్రమాదం నుంచి కాపాడేందుకు అడిగినంత పంపాలని కోరుతున్నారు. నిజమేనని నమ్మి తల్లిదండ్రులు డబ్బులు పంపిన కొద్ది క్షణాల్లో ఫోన్​ స్విచాఫ్​ చేస్తున్నారు.

చదవండి : అదిరిపోయే కొత్త ఫీచర్స్ తో ఈ డిసెంబర్ లో వచ్చిన  స్మార్ట్ ఫోన్లు ఇవే

ఇలా వాట్సాప్​ ద్వారా తల్లిదండ్రుల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బు కాజేస్తున్న సంఘటనలు ఇటీవల యూకేలో ఎక్కువయ్యాయి. ఎక్స్‌ప్రెస్ UK ప్రకారం, ఇలాంటి వాట్సాప్​ ఫేజ్​ మెసేజ్​లతో యూకేలో ఓ వ్యక్తి 7000 పౌండ్లు (సుమారు రూ. 7 లక్షలు), మరో వ్యక్తి 5000 పౌండ్లు (రూ. 3 లక్షలు) పోగొట్టుకున్నారు. సైబర్​ నేరగాళ్లు తల్లిదండ్రులు, వారి పిల్లల గురించి సమాచారం సేకరించి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు

* స్నేహితులు, బంధులవుల పేర్లతో ఫేక్​ అకౌంట్లు..

Flash...   Mid Night Sun: భూమిపై సూర్యుడు అస్త‌మించ‌ని ప్రాంతాలు ఎక్క‌డున్నాయో తెలుసా?

ఈ తరహా మోసాలు యూకేలోనే కాదు భారత్​లో కూడా వెలుగులోకొస్తున్నాయి. ఫేక్​ అకౌంట్లతో తల్లిందండ్రులనే కాక, మిత్రులను కూడా మోసగిస్తున్నారు సైబర్​ నేరగాళ్లు. అయితే, ఇక్కడి కేటుగాళ్లు వాట్సాప్​కు బదులు మెసెంజర్​ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. మనకు తెలిసిన వ్యక్తి పేరుతోనే ఫేక్​ అకౌంట్​ క్రియేట్ చేసి మెసేజ్​లు పంపిస్తున్నారు.

చదవండి : రాబోవు PRC  లో మీ బేసిక్ పే ఎంతో తెలుసుకోండి 

సోదరుడు, సోదరి, బంధువు, స్నేహితులు లేదా బంధువులు ఇలా ఎవరి పేరుమీదనైనా అకౌంట్​ క్రియేట్​ చేసి ఆపదలో ఉన్నామని, డబ్బు కావాలని అడుగుతున్నారు. అవి నిజమని నమ్మి.. తమ స్నేహితుడిని ఆపద నుంచి రక్షిద్దామని భావించి చాలా మంది డబ్బులు పంపించి మోసపోతున్నారు. ఈ విషయంలో వాట్సాప్, మెసెంజర్​ యాజమాన్యాలు భద్రతాపరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మోసాలు మాత్రం తగ్గట్లేదు. దీంతో ఇలాంటి వ్యవహారాలపై యూజర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని కంపెనీలు కోరుతున్నాయి.