వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్ Visakha… ?

 

విశాఖ ఏకైక అతి పెద్ద సిటీ ఏపీలో. ఈ సంగతి చెప్పడానికి పెద్దగా మేధస్సు అవసరం లేదు, విశాఖ మీద మమకారం అంతకంటే అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగితే చాలు. ఇదే మాటను వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెబితే కొందరు భుజాలు తడుముకుంటున్నారు. 

మనం కొత్తగా నగరాలు కట్టలేం, తాజ్ మహల్ నిర్మాణం కోసం ఏళ్ళకు ఏళ్ళు రాళ్ళెత్తే కూలీలం అసలు కాలేమని నిఖార్సుగా నిజాయతీగా ఆర్ధిక చిట్టాపద్దులు అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టి మరీ చెప్పినా కూడా విమర్శలు వెల్లువగా వస్తూనే ఉంటాయి.

చదవండి : అయినా .. కర్నూలుకే కార్యాలయాల తరలింపు !

రెడీ మేడ్ సిటీ ఉంది. అది విశాఖగా ఉంది. దానికి వాడుకుందాం, కనీసం అయిదు పది ఏళ్లలో అటు హైదరాబాద్, ఇటు చెన్నై, బెంగుళూర్ లకు ధీటుగా నిలుద్దామని వైసీపీ పాలకులు చెబుతున్నారు. విశాఖకు రైల్, రోడ్, సీ, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. రాజధాని అన్న ట్యాగ్ తగిలిస్తే చాలు అభివృద్ధి తారాజువ్వలా నింగికి ఎగియడం ఖాయమని కూడా వైసీపీ నేతలే కాదు, ఏపీ గురించి ఎరిగిన వారూ మేధావులూ చెబుతున్న మాట.

అయితేనేమి, మాకు కొత్తగా పేరు పెట్టిన రాజధాని మాత్రమే కావాలి. అక్కడే లక్షల కోట్లు కుమ్మరించాలి అని పట్టుబట్టిన వారికి చెప్పేది ఏమీ లేదు, బహుశా ఇదే రకమైన భావనో, లేక పట్టుదలో ఏదో ఒకటి వైసీపీ సర్కార్ పెద్దలకు వచ్చి ఉండాలి. అందుకే వారు ఇక మరింత పెద్దగా ఎలాంటి శషబిషలకు తావు లేకుండా విశాఖే మన రాజధాని అని చెప్పబోతున్నారు అని అంటున్నారు.

ఇక మూడు రాజధానులు అవసరమా అన్న వారికి కూడా జవాబు కరెక్ట్ గా దొరికేలా వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్ సిటీగా విశాఖనే ప్రకటిస్తారని అంటున్నారు. అదే జరిగితే విశాఖకే కాదు, ఏపీకి మంచిది, ఇంకా చెప్పాలంటే సౌతిండియాకూ మంచిచే, దేశ జీడీపీకి మరీ మంచిదని తలలు పండిన ఎకనామిస్టులు కూడా అంటున్నారు. 

Flash...   AP PRC : తెల్చుడా .... నాన్చుడా ..జనవరిలోనే ప్రకటన

మొత్తానికి ఏపీకి రాజధాని ఏదీ అంటూ వెటకారం ఆడేవారికి సరైన సమాధానం తొందరలోనే దొరుకుతుందా అంటే అవును అని జవాబు వస్తోంది. సో వెయిట్ అండ్ సీ. ఇక్కడో విశేషం ఎంటి అంటే తెలుగు వారికి ప్రీతిపాత్రమైన ఉగాదీ వేళ ఏపీకి విశాఖ రాజధాని అవుతుందిట