ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న బేసిక్ శాలరీ
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ కానుక అందించాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మినిమమ్ బేసిక్ శాలరీని భారీగా పెంచాలని చూస్తోంది. ప్రస్తుతం 18 వేలుగా ఉన్న మినిమమ్ బేసిక్ వేతనాన్ని త్వరలోనే 26 వేలు చేయనుందని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ పెరగనుంది. ఫిట్‌మెంట్ పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం కూడా పెరుగుతుంది. మీడియా రిపోర్టుల ప్రకారం, ఈ విషయంపై ప్రభుత్వ ప్రతినిధులతో ఉద్యోగ సంస్థలు చర్చలు జరపబోతున్నాయి. ఈ మీటింగ్ తర్వాత మినిమమ్ శాలరీ భారీగా పెరిగే అవకాశం ఉంది.
READ: KNOW YOUR TOTAL SALARY WITH NEW PRC FITMENT
మోదీ ప్రభుత్వం ఫిట్‌మెంట్ పెంచితే మినిమమ్ బేసిక్ శాలరీ కూడా రూ.26 వేలకు పెరుగుతుంది. బడ్జెట్‌కి ముందే కేబినెట్ ముందుకు ఈ ప్రతిపాదన రానుంది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపితే, బడ్జెట్‌కి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మినిమమ్ బేసిక్ శాలరీ పెరగనుంది.
ఫిట్‌మెంట్‌ను 2.57 శాతం నుంచి 3.68 శాతానికి పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటోంది. కేంద్ర కేబినెట్ నుంచి ఫిట్‌మెంట్ పెంపుపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆమోదం లభించనుందని పలు మీడియా రిపోర్టులు కూడా పేర్కొంటున్నాయి. కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ ఖర్చులలో దీనిని కలుపనున్నారు.
అన్ని అలవెన్స్‌లు పెరుగుతాయ్..
బేసిక్ వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెరిగితే, డియర్‌నెస్ అలవెన్స్ కూడా పెరుగుతుంది. బేసిక్ వేతనంలో డియర్‌నెస్ అలవెన్స్ 31 శాతం ఉంటుంది. బేసిక్ వేతనం పెరిగితే, డియర్‌నెస్ అలవెన్స్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.