11 వ PRC లో ఫిట్మెంట్ 23. 29 % – మీ శాలరీ వివరాలు తెలుసుకోండి

🍁11 వ PRC ఫిట్ మెంట్ 23.29% 



HRA WISE LOSS IN NEW PRC 2022








Download-New salaries with 23% Fitment.pdf'(HRA-12)  NEW



PRC 2018 WITH 23% FITMENT READY RECKONER  NEW

https://teluguenews.com/PRC.aspx

డీఎస్సీ వారీ గా కొత్త పీఆర్సీ లో పెరిగిన జీతాలు 

 రిటైర్ మెంట్ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంపు

జీతాలలో పెంపు జనవరి 2022 నుండి అమలు

పెండింగ్‌లో ఉన్న DA లు అన్నీ జనవరి నుండి ఇస్తామని చెప్పారు.

CPS పై జూన్ లో తేలుస్తాం.
మానిటరీ బెనిఫిట్ ఫండ్ 2020  ఏప్రిల్ నుంచి
జీతాలు పెంపు జనవరి 2022 నుండి ఇస్తారు

సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 14.29శాతం మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను, సమస్యలను అన్నికోణాల్లో క్షుణ్నంగా అధ్యయనం చేసి ఒక వాస్తవికమైన ఫిగర్‌ను వారు చెప్పినప్పటికీ…., 

Flash...   AMMA VODI 2022: జూన్‌ 21వ తేదీన అమ్మ ఒడి

అటు ఉద్యోగుల ఆకాంక్షలను, ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని, ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో ఫిట్‌మెంట్‌ను 23శాతంగా నిర్ణయించాం. అధికారుల కమిటీ చెప్పిన 14.29శాతం కన్నా దాదాపు 9శాతం పెంచి ఫిట్‌మెంట్‌ ఇస్తున్నామని ఉద్యోగ సోదరులకు సవినయంగా అర్థంచేసుకోవాలని  మనవిచేసుకుంటున్నాను.

– ఈ పీఆర్సీ అమలు 01–07–2018 నుంచి, 

– మానిటరీ బెనిఫిట్‌ అమలు 01–04–2020 నుంచి, 

– కొత్త జీతాలు 01–01–2022 నుంచి అమల్లోకి వస్తాయి. 

ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి రూ. 10,247 కోట్లు రాష్ట్ర ప్రభుతానికి అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని, ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను.

చివరగా మరో ముఖ్యమైన కీలక నిర్ణయం కూడా ప్రకటిస్తున్నాను.

ప్రభుత్వోద్యోగులు అనే కన్నా మంచి చేయడానికి ఎల్లవేలలా ఉద్యోగులకు తోడుగా ఉంటూ, మీ అందరికీ భరోసా ఇస్తూ…

మీరంతా సుదీర్ఘ కాలం ప్రజా సేవలో జీవితం గడపిన వ్యక్తులు. మీకు ఇంకా మంచి చేయడానికి, మీ అనుభవాన్ని ఈ రాష్ట్రానికి ఆస్తిగా భావించి, అన్నిరకాలుగా మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో, మీ సేవలన్ని మనం మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలన్న నిర్ణయంతో… వారి రిటైర్‌మెంట్‌ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నాం అని… 1.1.2022 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని తెలియజేస్తున్నాను. 

– సీపీఎస్‌కు కూడా సంబంధించి టైంలైన్‌ పెట్టుకోవాలి. ఇప్పటికే కేబినెట్‌సబ్‌కెమిటీ వేశాం. జూన్‌ 30లోగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం.

ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మనసుతో, గుండెతో స్పందించే ఈ నిర్ణయాలు ప్రకటిస్తున్నాను.  దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం మంచి పాలన అందించటంలో ఉద్యోగుల సహాయ సహకారాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను

PRC 2018 WITH 23% FITMENT READY RECKONER  NEW

CLICK THIS LINK TO CLCULATE YOUR BASIC PAY 

https://teluguenews.com/PRC.aspx

Flash...   Srilanka Economic Crisis: శ్రీలంకలో చేయి దాటిపోతున్న పరిస్థితులు.. మిలటరీకి ఎమర్జెన్సీ అధికారాలు