Alert : SBI కీలక నిర్ణయం.. మనీ ట్రాన్స్‌ఫర్‌పై కొత్త ఛార్జీలు

 అలర్ట్ : SBI కీలక నిర్ణయం.. మనీ ట్రాన్స్‌ఫర్‌పై కొత్త ఛార్జీలు

దిశ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ SBI కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ వేళ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతూనే ఛార్జీలు పెంచింది. RBI మార్గదర్శకాల మేరకు SBI.. ఇమిడియెట్‌ పేమెంట్‌ సర్వీస్​(IMPS) లావాదేవీల పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, రూ.2 లక్షల – రూ.5 లక్షల వరకు ప్రతీ లావాదేవీకి రూ.20పైగా GST చెల్లించాల్సి ఉంటుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజా ప్రకటనలో పేర్కొంది. మనీ ట్రాన్స్‌ఫర్‌ కోసం ఆదివారాలు, సెలవు రోజుల్లో సైతం ఐఎంపీఎస్​ సాయపడుతుంది. ఈ ఏడాది కొత్తగా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల శ్లాబ్‌ను ఎస్‌బీఐ ఏర్పాటు చేసింది. అయితే.. వెయ్యి రూపాయల వరకు నగదు లావాదేవీకి ఎలాంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. వెయ్యి నుంచి రూ.10 వేల వరకు రూ.2, రూ.10వేలు నుంచి రూ.లక్ష వరకు రూ.4, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.12పైగా కస్టమర్లు GST చెల్లించాల్సి ఉంటుంది.

Also Read:

SBI Recruitment 2021: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు

SBI 3 in 1 offer: SBI ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!

Online లోఇంటినుంచే  సుల‌భంగా SBI ప్రీ అప్రూవ్డ్ ప‌ర్స‌న‌ల్‌ లోన్స్‌

IMPS అంటే..

ఐఎంపీఎస్ అంటే ఇమిడియేట్ పేమెంట్ స‌ర్వీసు. తక్షణమే నగదు బదిలీకి ఇది ఉపయోగపడుతుంది. ఈ సేవ‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) అందిస్తోంది. ఐఎంపీఎస్ ద్వారా లావాదేవీలు చేసేందుకు మొబైల్ నెంబర్, మొబైల్ మనీ ఐడెంటిఫైర్ లేదా బ్యాంకు అకౌంట్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లేదా ఆధార్ అవసరం. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా కూడా పేమెంట్లు చేసుకోవచ్చు.

Flash...   ఏపీలో పదో తరగతి పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథం - ఆదిమూలపు సురేష్