AP లో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య ప్రారంభమైన యుద్ధం

 ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య ప్రారంభమైన యుద్ధం


అమరావతి: ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య యుద్ధం ప్రారంభమైంది.  ఉద్యోగుల ఆందోళనను కౌంటర్‌ చేస్తూ నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులను ప్రభుత్వం రంగంలోకి దించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారుల ప్రకటనపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జీఓ కాపీలను ఎన్‌జీఓ హోం ముందు దగ్ధం చేసి సవాలు విసిరాయి. ఉద్యోగుల జీతాలు తగ్గవంటూ అధికారుల ప్రకటన చేశారు. రాష్ట్ర ఆదాయం పడిపోయిందని ఆర్ధికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్పష్టం చేశారు. విభజన, కరోనా వల్ల ఆదాయం తగ్గిపోయిందని అధికారులు అంటున్నారు. విశాల దృక్పథంతో ఉద్యోగులు వ్యవహరించాలని ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. 

 READPRC ఉద్యోగుల ఆందోళనపై ఏపీ సీఎస్ సమీర్ శర్మ కీలక వ్యాఖ్యలు

ఈ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. విశాల దృక్పదం వల్లే రెండున్నర సంవత్సరాలు పీఆర్‌సీ కోసం ఓపికపట్టామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. జీతం ఎలా తగ్గుతుందో లెక్కలేసి మరీ బొప్పరాజు చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెరిగిందని కాగ్‌ నివేదిక, విజయ్‌సాయి రెడ్డి ట్వీట్‌ను ఉద్యోగ సంఘాల నేతలు చూపించారు. ఫిట్‌మెంట్‌ , హెచ్‌ఆర్‌ఏలో కోత విదిస్తే జీతం తగ్గదా అని ప్రశ్నించారు. మాటలు లేవు, చర్చలు లేవు ఆందోళనకే సై అని బండి శ్రీను తెలిపారు. 21వ తేదీన సమ్మె నోటీసు ఇస్తామని సవాల్‌ విసిరారు.

Flash...   Circular on roles of the staff on Good Governance Initiatives