AP CABINETMEET: రేపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినేట్ భేటీ

 రేపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినేట్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినెట్ రేపు స‌మావేశం కానుంది. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండ‌లి స‌మావేశం కానుంది. శుక్రవారం ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్ర స‌చివాల‌యంలో రాష్ట్ర మంత్రి మండ‌లి భేటీ జరగనుంది. ఈ స‌మావేశంలో రాష్ట్ర మంత్రి మండ‌లి ప‌లు కీల‌క నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ విషయం పై అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు వార్‌ నడుస్తుంది. ఇటీవ‌ల ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీతో పాటు దాని ఇచ్చిన జీవోలను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.

అంతే కాకుండా స‌మ్మె చేయ‌డానికి కూడా సిద్ధం అని ప్రకటించారు .ఈ నెల 21 న స‌మ్మె నోటీసులు కూడా ఇవ్వనున్నారు. దీంతో పీఆర్సీ పై రాష్ట్ర కేబినెట్ లో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. అలాగే సినిమా టికెట్ల ధ‌రల విష‌యంలో కూడా రాష్ట్ర కేబినెట్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ఇటీవల మెగా స్టార్ చిరంజీవి, సీఎం జ‌గ‌న్ స‌మావేశం అయిన విష‌యం తెల్సిందే. ఈ స‌మావేశంలో సినిమా ఇండ‌స్ట్రీకి అనుకూలం నిర్ణయం వ‌స్తుంద‌ని చిరంజీవి కూడా ప్రకటించారు. దీంతో సినిమా టికెట్ల ధ‌రల విష‌యంలో కేబినెట్ కీల‌క నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు ఏకంగా 12 వేల కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో క‌రోనా వ్యాప్తి పై కూడా కేబినెట్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. అంతే కాకుండా పాఠశాలల కొనసాగింపు పైనా నిర్ణయం వెలువడే అవకాశాలు లేకపోలేదు. ఓ వైపు ఉద్యోగ సంఘాల ఆందోళనల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Flash...   Smart phone: మీ ఫోన్‌లో మీకే తెలియని చాలా రహస్యాలు.. ఈ సింపుల్ కోడ్స్‌తో తెలుసుకోండి.