AP Corona Cases: ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. ఆ 2 జిల్లాల్లో వైరస్ కల్లోలం

 AP Corona Cases: ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. ఆ 2 జిల్లాల్లో వైరస్ కల్లోలం

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  తాజాగా 24 గంటల వ్యవధిలో 38,055 శాంపిల్స్ ని పరీక్షించగా 6,996 మందికి కరోనా సోకినట్లు తేలింది.  ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2117384కి చేరింది. కొత్తగా కోవిడ్ కారణంగా కోవిడ్ వల్ల విశాఖ జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు,  నెల్లూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు విడిచారు. 

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14514కు చేరింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 36108 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,066 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2066762కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,19,22,969 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా చిత్తూరు జిల్లాలో ప్రమాదకరంగా 1534 వెలుగుచూశాయి. విశాఖలో కూడా పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. జిల్లాలో కొత్తగా 1263 కేసులు నమోదయ్యాయి.



Flash...   వివాదాలకు కారణమయ్యే ఉపాధ్యాయులపై చర్యలు .. మంత్రి సురేష్